సర్ధుకుపోయే స్వభావం కాదు. సర్ది చెప్పుకునే నేర్పు లేదు. సంసారంలో తలెత్తే చిన్న చిన్న సమస్యల్ని తట్టుకునే సహనం లేదు. కేవలం తన మాట నెగ్గలేదనే కోపంతో ఓ భర్త కట్టుకున్న భార్యపై రివేంజ్(Revenge)తీర్చుకోవాలనుకున్నాడు. కేవలం కాసేపు మాట్లాడుకుంటే పరిష్కారమయ్యే విషయాన్ని ప్రాణాలు తీసుకునేంత సీరియస్ మ్యాటర్(Serious matter)గా మార్చేశాడు. ఫలితంగా అతను ప్రాణాలు కోల్పోయాడు. భార్యను భర్తలేని విదవరాలిగా మార్చాడు. హైదరాబాద్(Hyderabad)లో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
అవమానంగా ఫీలయ్యాడు...
తుక్కుగూడకు చెందిన సాయికార్తీక్‌గౌడ్ అనే 33సంవత్సరాల వ్యక్తి రవిళి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ అన్యోన్యంగానే జీవిస్తున్నారు. అయితే ఈనెల 12వ తేది నాడు సాయికార్తీక్‌గౌడ్, రవళి కందుకూరు మండలం బేగంపేటలోని బంధువుల వివాహానికి వెళ్లారు. పెళ్లి అయిపోగానే రవళి అక్కడే ఉంది. కార్తీక్ తిరిగి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని పహాడి షరీఫ్‌కి శనివారం వచ్చాడు. అయితే ఆదివారం తన అత్తయ్య వాళ్లు బోనాల పండుగ చేసుకుంటున్నారని...కాబట్టి త్వరగా వస్తే మీర్‌పేటలోని అత్తయ్య ఇంటికి వెళ్దామని కార్తీక్ భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. అందుకు రవళి భర్త ఫోన్‌కాల్‌ని సీరియస్‌గా తీసుకోలేదు.
భార్యపై కోపంతో అలా చేశాడు..
ఫోన్ చేసి చెప్పినప్పటికి భార్య తన మాట లెక్కచేయలేదని అవమానానికి గురయ్యాడు సాయికార్తీక్‌గౌడ్. భార్య ప్రవర్తించిన తీరుతో తీవ్రమనస్థాపానికి గురైన కార్తీక్ మరోసారి రవళికి వీడియో కాల్ చేశాడు. మీ బంధువుల ఇళ్లలో జరిగే అన్ని కార్యక్రమాలకు హాజరవుతున్న ..మా బంధువుల ఇళ్లలో జరిగే వేడుకలకు ఎందుకు రావడం లేదని కోపంతో చెప్పాడు. అంతటితో ఆగకుండా వీడియో కాల్‌లోనే తన మాట లెక్కచేయని కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఇంటి పైకప్పుకు ఉరివేసుకొని ఫోన్‌ని పడేశాడు. ఫోన్‌లో ఏమీ కనబడకపోవడంతో రవళి భయాందోళనకు గురైంది. వెంటనే తమ ఇంటి చుట్టు పక్కల ఉంటున్న వాళ్లకు ఫోన్ చేసి తన భర్త ఉరివేసుకున్నాడని ఎలాగైనా రక్షించమని ప్రాధేయపడింది.
చేయని తప్పుకు ఇద్దరికి శిక్ష..
హుటాహుటిన తుక్కుగూడలోని తన ఇంటికి కూడా వెళ్లింది. అయితే ఆమె ఇంటికి చేరుకునేసరికి కార్తీక్ చనిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు స్పాట్‌కి చేరుకున్నారు. కార్తీక్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.