Love attack : ప్రేమించడం లేదని యువతి ఇంటినే తగులబెట్టాడు..

Love attack : ప్రేమించడం లేదని యువతి ఇంటినే తగులబెట్టాడు..

Love attack : ప్రేమిస్తున్నానని వెంటపడిన ఓ యువకుడు... బెదిరింపులకు దిగాడు.. ప్రేమించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. లేదంటే ఇంటినే ఏకంగా తగలబెడతానని తీవ్రంగా హెచ్చరించాడు. దీంతో బెదిరించినట్టుగానే తాను ప్రేమించిన యువతి ఇంటిని తగలబెట్టాడు.

  • Share this:
    నేటి యువతకు ప్రేమించడం.. యువతుల వెంటబడి వేధించడం మరీ.. వినకపోతే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడక పోవడం లాంటి దారుణాలకు దిగుతున్నారు. దేశంలో ఎక్కడైనా ఇప్పుడు ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ప్రేమ పేరుతో యువకులు ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తుండడంతో యువతు్ల్లో మరింత ఆందోళన మొదలవుతోంది. ఈ క్రమంలోనే ఓ యువకుడు తనను ప్రేమించని యువతి ఇంటిని ఎవరు లేని సమయంలో తగులబెట్టాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆ యువకున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.

    వివరాల్లోకి వెళితే.. నగరంలోని జవహార్‌నగర్ ( Hyderabad ) పరిధిలోని బీజేఆర్‌నగర్‌కు చెందిన నవీన్ అనే యువకుడు ఫుడ్ డెలివరి బాయ్‌గా ( Food delivery boy ) చేస్తున్నాడు. అయితే అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని గత రెండు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నానంటూ ( love ) పెళ్లి చేసుకోవాలని వెంటపడి వేధింపులకు గురి చేస్తున్నాడు. అయితే ఆ యువతికి ఇష్టం లేకపోవడంతో  ఇటివలే వేరే వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ చేశారు. దీంతో విషయం తెలిసిన నవీన్ ఆ యువతి తల్లిదండ్రులను ( threten ) బెదిరించాడు. తనకు ఆమెతో పెళ్లి చేయకపోతే వారు ఉంటున్న ఇంటిని తగులబెడతానని హెచ్చరించాడు.

    ఇది చదవండి : ఒంటరి మహిళను లొంగదీసుకున్న కానిస్టేబుల్.. కొన్నాళ్లకు ఆమె కూతురిపై కన్నేసి..


    ఇది చదవండి : పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కొత్త పార్టీ -సిక్కును సిక్కుతోనే అడ్డుకొనేలా బీజేపీ బంపర్ ప్లాన్! -కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?


    ఇదిలా ఉండగా యువతి కుటుంబ సభ్యులు నవీ‌కు తెలియకుండా వారి అమ్మమ్మ ఊరికి వెళ్లారు. అమ్మమ్మకు అనారోగ్యం బాగా లేకపోవడంతో ఈ నెల 10 వ తేదిన అందరు కలిసి ఇంటికి తాళం వేసి వెళ్లి పోయారు. దీంతో మరింత రెచ్చిపోయిన నవీన్ తనను కాదని పెళ్లి చేసేందుకు వెళ్లారని భావించారు. దీంతో కోపంతో రగిలిపోయి .. హెచ్చరించినట్టుగానే గత నాలుగు రోజుల క్రితం యువతి ఉంటున్న ఇంటికి ( Fire ) నిప్పటించారు. దీంతో ఇళ్లు పాక్షికంగా మంటల్లో కాలిపోయింది. విషయాన్ని కుటుంబ సభ్యులకు  స్థానికులు  తెలపడంతో సంఘటన స్థలానికి చేరుకుని , నవీన్‌ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక సిఐ బిక్షపతి రావు తెలిపారు.
    Published by:yveerash yveerash
    First published: