హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో చేసిన ఓ ఫోటో వైరల్ గా మారింది. మరీ అలా చూపించేసింది ఏంటి అంటూ నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆమె త్వరలోనే తల్లి కాబోతోందా..? మూడో సంతానం కావాలని కోరుకుంటోందా అని చర్చ మొదలైంది. ఇంతకీ అసలు మేటర్ ఏంటి?
అనసూయ భరద్వాజ్ తెలగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అవసరం లేని యాంకర్. అయితే తాజాగా ఆమె చేసిన ఒక ఫోటో వైరల్ గా మారింది. ఆమె మళ్లీ గర్భం దాల్చిందా? అని డౌట్ పడుతున్నారు..? స్వయంగా అనసూయే ఆ ఫోటోను షేర్ చేయడంతో అంతా షాక్ అవుతున్నారు. (Instagram/Photos)
ఎప్పటికప్పుడు తన జబర్దస్త్ అందాలతో కవ్వించే అనసూయ.. తాజాగా తను గర్భంతో ఉన్న ఓ పిక్ షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. మరి ఈ పిక్ ఆమె ఎందుకు షేర్ చేసింది. అసలు మ్యాటర్ ఏంటి? నిజంగా ఆమె ఇప్పుడు గర్భంతో ఉందా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు..
నిత్యం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వార్తల్లో నిలవడంలో అనసూయ ముందు ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పటికప్పుడు తన జబర్దస్త్ అందాలతో కవ్విస్తూనే జనాల్లో హాట్ టాపిక్ అవుతూ ఉంటారు. తనపై ఎన్నిరకాలుగా ట్రోల్స్ వచ్చినా ఏ మాత్రం పట్టించుకోకుండా మరింత జోష్తో సోషల్ మీడియాలో అభిమానుకలు సమాధానాలు చెబుతూ యాక్టివ్ గా ఉంటుంది రంగమ్మత్త.
తాజాగా ఆమె షేర్ చేసిన ఈ పిక్ చూసి నెటిజన్లు అంతా షాక్ అవుతున్నారు. ఇందుకు కారణం ఇందులో అనసూయ గర్భంతో ఉండడమే.. అది అందరికీ కనిపించేలా చూపిస్తూ ఫోటోను షేర్ చేశారు అనసూయ..
నిజంగానే అనసూయ గర్భంతో ఉన్నారా? ఇప్పటికే ఆమె ఇద్దరు పిల్లలకు తల్లి కూడా.. మళ్లీ గర్భమా అంటూ నెటిజన్లు చర్చించుకోవడం మొదలు పెట్టారు. కొందరైతే కంగ్రాట్స్ అంటూ కామెంట్లు కూడా పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. (Anasuya Bharadwaj new photos/instagram)
అయితే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో తన మనసులోకి మాటలను బయటపెట్టి ఆమె అందర్నీ ఆశ్చర్యపరిచింది. తనకు మూడో సంతానం కనాలని ఉందని హాట్ యాంకర్ చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. ఒక్కసారిగా జనాల్లో ఈ విషయమై చర్చలు ముదిరాయి. ఇంతలో ఇప్పుడు ఏకంగా గర్భంతో ఉన్న ఫొటోనే షేర్ చేయడంతో దీనిపై కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.
అయితే అసలు మేటర్ ఏంటంటే.. అనసూయ నిజంగా గర్భం దాల్చలేదు. ఇటీవలే ఆమె నటించిన థాంక్యూ బ్రదర్ సినిమా లోని ఓ పిక్ బయటపెట్టింది అంతే.
అనసూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన థాంక్యూ బ్రదర్ సినిమా ఇటీవలే ఆహా ఓటీటీ వేదికపై విడుదలైంది. రమేష్ రాపర్తి దర్శకత్వంలో జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. అయితే తన సినిమాను ఇలా మరోసారి పోస్ట్ ప్రమోషన్ చేస్తూ అట్రాక్ట్ చేసింది అనసూయ.
తాజాగా ఆమె చేసిన ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనసూయ మళ్లీ తల్లి కాబోతోందా అంటూ ప్రచారం సాగుతోంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.