HYDERABAD HOME GUARD IMPREGNATED 16 YEAR OLD MINOR GIRL AFTER TAKEN ADVANCE WITH LOVE PROPOSAL HSN
Hyderabad: 16 ఏళ్ల బాలికకు అనారోగ్యం.. ఆస్పత్రికి తీసుకెళ్తే అబార్షన్ చేయించారన్న నిజం వెలుగులోకి.. ఆమెను నిలదీస్తే..
ప్రతీకాత్మక చిత్రం
కొద్ది రోజులుగా ఆ బాలిక తీవ్ర అస్వస్థతకు లోనవుతోంది. దీంతో తల్లిదండ్రులు ఆ బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఏం జరిగిందో గ్రహించి ఆ తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో ఆ బాలికను నిలదీస్తే తల్లిదండ్రుల ఎదుట జరిగిందంతా చెప్పుకుని బోరుమని ఏడ్చింది.
సమాజంలో స్త్రీలకు రక్షణ లేకుండా పోతోంది. ఇంటి పక్కింటి వాళ్ల రూపంలోనో, స్నేహితుల రూపంలోనో కామాంధులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఆఫీసుల్లోనో, కాలేజీల్లోనో కాదు సొంత ఇంట్లో కూడా రక్షణ లేకుండా పోతోంది. తండ్రి, సోదరులు కూడా కొన్ని చోట్ల బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. నిర్భయ, దిశ వంటి చట్టాలు వచ్చినా సరే కామాంధులు నిర్భయంగా రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ హోంగార్డు 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె గర్భవతి కావడంతో భయంతో ఆమెకు అబార్షన్ కూడా చేయించాడు. బాలిక కొద్ది రోజులుగా అనారోగ్యం పాలవడంతో తల్లిదండ్రులు నిలదీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ హోంగార్డుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ లోని ఓ హోంగార్డు స్థానికంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నాడు. అతడికి చెందిన అపార్ట్మెంట్ లోనే ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది. ఆ కుటుంబంలో 16 ఏళ్ల బాలిక కూడా ఉంది. ఆ బాలికతో పరిచయం పెంచుకుని తరచూ మాట్లాడుతుండేవాడు. ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పి ఆమెను లోబరుచుకున్నాడు. ఆమెపై తరచూ లైంగిక దాడి చేసేవాడు. త్వరలో పెళ్లి చేసుకుంటానంటూ ఆశ చూపాడు. ఈ క్రమంలోనే ఆమె గర్భవతి అయింది. ఈ విషయం బయటకు తెలిస్తే ప్రమాదమని గ్రహించిన హోంగార్డు ఆమెకు అబార్షన్ చేయించాడు.
కొద్ది రోజులుగా ఆ బాలిక తీవ్ర అస్వస్థతకు లోనవుతోంది. దీంతో తల్లిదండ్రులు ఆ బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఏం జరిగిందో గ్రహించి ఆ తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో ఆ బాలికను నిలదీస్తే తల్లిదండ్రుల ఎదుట జరిగిందంతా చెప్పుకుని బోరుమని ఏడ్చింది. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని వాపోయింది. ఈ ఘటనపై గోపాలపురం అసిస్టెంట్ కమిషనర్ వెంకటరమణకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ హోంగార్డును అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.