Home /News /telangana /

HYDERABAD HOLIDAYS FROM 27APRIL TO MAY 31ST ANNOUNSED SCHOOL EDUCATION DPT GOVT OF TS VS

school holidays : తెలంగాణలో వేసవి సెలవులు.... 1 నుండి 9 విద్యార్థులు.. అందరు పాస్...

తెలంగాణలో వేసవి సెలవులు

తెలంగాణలో వేసవి సెలవులు

holidays :స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది తెలంగాణ రాష్ట్రప్రభుత్వం. రేపటితో విద్యాసంవత్సరానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఇదే అంశంపై సీఎం కేసీఆర్ , విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిలు నేడు సమీక్ష నిర్వహించారు.

తెలంగాణ విద్యాశాఖ వేసవి సెలవులను ప్రకటించింది. ఏప్రిల్ 27 నుండి మే 31 వరకు పాఠశాల, జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటించినట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు..కరోనా నేపథ్యంలోనే సెలవులపై సీఎం కేసీఆర్ , మంత్రి సబితా ఇంద్రారెడ్డిలు కలిసి విద్యాశాఖ అధికారులతో ఆదివారం ఉదయం సమీక్ష నిర్వహించారు. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఇక రేపు అనగా సోమవారం 2020-21 విద్యాసంవత్సరానికి చివరి దినంగా ఆమె పేర్కోన్నారు. అయితే విద్యాసంవత్సరాన్ని తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారనే నిర్ణయాన్ని జూన్ 1న నిర్ణయం తీసుకుంటారని మంత్రి తెలిపారు.

1 నుండి 9 తరగతుల విద్యార్థులు అందరు పాస్...

ఇక 1 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న 53 లక్షల 79 వేల 388 మంది విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసినట్లు మంత్రి తెలిపారు. కరోనా విస్తరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు రద్దు చేసి 5,21,392 మంది విద్యార్థులను పాస్ చేసినట్లు
మంత్రి గుర్తు చేశారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలను తరువాత ఎప్పుడు తెరిచేది కోవిడ్ - 19 పరిస్థితిని అనుసరించి జూన్ 1న ప్రభుత్వం నిర్ణయిస్తుందని మంత్రి తెలిపారు. ఏప్రిల్ 26వ తేదీని ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి దినంగా పరిగణిస్తామని మంత్రి పేర్కొన్నారు.



1 నుండి 11 వరకు అందరు ప్రమోట్

ఇక 2020-21 విద్యాసంవత్సరం పూర్తిగా ప్రమోటెడ్ విద్యాసంవత్సరంగా మిగిలిపోనుంది.  ఎందుకంటే ఒకటవ తరగతి నుండి 11 వ తరగతి వరకు అంటే ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను కూడ పూర్తిగా ప్రమోట్ చేశారు. అయితే పదవ తరగతి పరీక్షలు నిర్వాహించాలని ప్రభుత్వం భావించిన సెకండ్ వేవ్ కరోనాతో రద్దు నిర్ణయం తీసుకున్నారు..దీంతో ఈ విద్యాసంవత్సరం పూర్తి కరోనా ఇయార్  పాస్ అవుట్‌గా విద్యార్థులు మిగిలిపోనున్నారు.

ఈ విద్యాసంవత్సరం ఏమవుతుందో...

కాగా ప్రభుత్వం అధికారిక సెలవులు ప్రకటించినా..గడిచిన సంవత్సరం కూడ పెద్దగా చదువులు కొనసాగిన పరిస్థితి కనిపించలేదు.  కాగా ఇప్పుడు కూడ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కాగా తెలంగాణలో ఇప్పటికే కరోనా భారిన పడినవారు మూడులక్షల పైగా ఉండడం ఆందోళన కల్గిస్తుండడంతో ముందుగానే ప్రభుత్వం సెలవుల నిర్ణయం తీసుకుంది.  విద్యాసంస్థలకు సెలవు  ప్రకటించినా..ఇంకా టీచర్లు మాత్రం స్కూళ్లకు, కాలేజీలకు వెళుతున్నారు.  కరోనా భయంతో కొంతమంది టీచర్లు మాత్రం సెలవులు ప్రకటించండి లేదంటే స్కూళ్లు ప్రారంభించండి అంటూ ప్రభుత్వానికి  మొరపెట్టుకున్నారు. కాగా ఓవైపు లాక్డౌన్ విధిస్తారని ప్రచారం జరగడంతో కరోనా తీవ్రం కావడంతో రానున్న విద్యాసంవత్సరం కూడ ఎలా ఉంటుందో వేచి చూడాలి .





















కరోనా విస్తరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు రద్దు చేసి 5,21,392 మంది విద్యార్థులను పాస్ చేసినట్లు మంత్రి గుర్తు చేశారు. అదేవిధంగా 1 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న 53 లక్షల 79 వేల 388 మంది విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసినట్లు మంత్రి తెలిపారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలను తరువాత ఎప్పుడు తెరిచేది కోవిడ్ - 19 పరిస్థితిని అనుసరించి జూన్ 1న ప్రభుత్వం నిర్ణయిస్తుందని మంత్రి తెలిపారు. ఏప్రిల్ 26వ తేదీని ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి దినంగా పరిగణిస్తామని మంత్రి పేర్కొన్నారు.
Published by:yveerash yveerash
First published:

Tags: CM KCR, Sabitha Indra Reddy, Telangana schools

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు