హైదరాబాద్ ‘సైబర్ టవర్స్‌’కు 20 ఏళ్లు... ఐటీ హబ్‌గా హైటెక్ సిటీ

67 ఎక‌రాల్లో విస్త‌రించిన ఈ హైటెక్ సిటీలో ఎన్నో ఐటీ కంపెనీలు త‌మ కార్య‌క‌లాపాలు కొన‌సాగిస్తున్నాయి. ల‌క్ష‌ల‌మందికి ఉపాధి అవ‌కాశాలు దొరికాయి.

news18-telugu
Updated: September 24, 2019, 11:43 AM IST
హైదరాబాద్ ‘సైబర్ టవర్స్‌’కు 20 ఏళ్లు... ఐటీ హబ్‌గా హైటెక్ సిటీ
హైదరాబాద్ సైబర్ టవర్స్ (ఫైల్ ఫోటో)
  • Share this:
ఒక‌ప్పుడు ఆ ప్రాంత‌మంతా అడవిలా ఉండేది. ఓ కుగ్రామంలా కనిపించేది. ఎటు చూసిన రాళ్లు రప్పలే. పెద్ద‌గా జ‌న‌సంచారం కూడా ఉండేది కాదు. కానీ.. ఇప్పుడు కాస్ట్లీ ఏరియా. సొంతింటి మాట దేవుడెరుగు అక్క‌డ అద్దెకు ఇల్లు దొర‌కాల‌న్నా క‌ష్ట‌మే. అదే హైద‌రాబాద్ లోని హైటెక్ సిటీ. హైద‌రాబాద్ ఇన్ ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అండ్ ఇంజినీరింగ్ క‌న్స‌ల్టెన్సీ సిటీనే హైటెక్ సిటీ అని పిలుస్తున్నారు. 1998 న‌వంబ‌ర్ 22న సైబ‌ర్ ట‌వ‌ర్స్ ను అప్ప‌టి ప్ర‌ధాని అట‌ల్ బిహారి వాజ్ పేయి చేతుల మీదుగా ప్రారంభించారు. ప‌ని ప్రారంభించిన 14 నెలల్లోనే ఈ సైబ‌ర్ ట‌వ‌ర్ నిర్మాణం పూర్తిచేశారు.

అంత‌ర్జాతీయ స్థాయిలో భాగ్య‌న‌గరానికి కీర్తి ప్ర‌తిష్ట‌లు తెచ్చిపెట్టిన హైటెక్ సిటీ అప్ప‌టి ఉమ్మ‌డి రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మ‌న‌సులో మెదిలిన మాన‌స పుత్రిక‌. ప్ర‌పంచ పుట‌ల్లో హైద‌రాబాద్ ను ఓ వెలుగు వెలిగేలా చేసింది. దీంతో ఎంతోమంది ఐటీ దిగ్గజాల క‌న్ను హైద‌రాబాద్ పై ప‌డింది. ఐటీ రంగానికి మ‌రో సిలికాన్ సిటీగా నిలిచింది. అంతేకాదు... 67 ఎక‌రాల్లో విస్త‌రించిన ఈ హైటెక్ సిటీలో ఎన్నో ఐటీ కంపెనీలు త‌మ కార్య‌క‌లాపాలు కొన‌సాగిస్తున్నాయి. ల‌క్ష‌ల‌మందికి ఉపాధి అవ‌కాశాలు దొరికాయి. దేశానికి చెంద‌న‌వారే కాకుండా... విదేశాల‌కు చెందిన ఎంతోమంది ఇక్క‌డ ఐటీ కంపెనీల్లో ప‌నిచేస్తున్నారంటే అతిశ‌యోక్తి కాదు.

హైటెక్ సిటీ ప్రారంభంతో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థిక వ్య‌వ‌స్థే పూర్తిగా మారిపోయింది. ఒక‌ప్పుడు ఐటీగా కేరాఫ్ గా బెంగుళూరు ఉండేది. కానీ బెంగుళూరుకు ధీటుగా భాగ్య‌న‌గ‌రంలో ఐటీ హ‌బ్ ను నిర్మించారు చంద్ర‌బాబు. దీంతో పేరుగాంచిన పెద్ద పెద్ద ఐటీ కంపెనీల‌న్నీ ఇక్క‌డ కార్య‌క‌లాపాలు జ‌రుపుతున్నాయి. హైటెక్ సిటీ చుట్టూ ప‌లు వ్యాపార సంస్థ‌లు... స్టార్ మోట‌ల్స్ హాస్పిట‌ల్స్ ప్రారంభ‌మ‌య్యాయి. ఈ ప్రాంతంలో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం కూడా క‌న‌క‌వ‌ర్షం కురిపించింది. ఒక‌ప్పుడు 20వేల కూడా ప‌ల‌క‌ని ఎక‌రం భూమి... ఇప్పుడు కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తుతోంది.

తాజాగా అనేక అంత‌ర్జాతీయ స‌ద‌స్సుల‌కు వేదిక‌గా మారింది హైటెక్ సిటీ. ఆసియాలోనే అత్యంత వేగంగానే అభివృద్ధి చెందిన ప్రాంతంగా గుర్తింపు తెచ్చుకుంది. హైద‌రాబాద్ అంటే హైటెక్ సిటీ... హైటెక్ సిటీ అంటే హైద‌రాబాద్ అనే స్థాయిలో న‌గ‌ర‌వాసుల గుండెల్లో నిలిచిపోయింది.

ఇవికూడా చదవండి:

హైదరాబాద్ సైబర్ టవర్స్ ఎదుట... కేక్ కట్ చేసిన చంద్రబాబు అభిమానులు
Published by: Sulthana Begum Shaik
First published: September 24, 2019, 11:43 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading