Home /News /telangana /

HYDERABAD HISTORICAL BUILDINGS AND ANCIENT MUSEUMS IN HYDERABAD CAN BE VISITED WITHOUT A TICKET SNR

Hyderabad : హైదరాబాద్‌లోని చార్మినార్, గోల్కొండ ఇకపై ఫ్రీగా చూడొచ్చు ..ఎప్పటి వరకు అంటే..?

HYDERABAD(FILE PHOTO)

HYDERABAD(FILE PHOTO)

Hyderabad: హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పురావస్తు కేంద్రాలు, చారిత్రక ప్రదేశాలు, పురాతన కట్టడాలను చూడని వాళ్లకు ఓ గుడ్ న్యూస్. శుక్రవారం నుంచి పది రోజుల పాటు అన్నీ పర్యాటక ప్రదేశాలను ఉచితంగా చూడవచ్చు. ఎందుకంటే..

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభసందర్భంగా కేంద్రప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (Azadi Ka Amrit Mahotsav)పేరుతో దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ సంబురాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ(Telangana)ప్రజలకు మరో సుపర్ణ అవకాశం లభించింది. ఈనెలలో పది రోజుల పాటు తెలంగాణలోని పర్యాటక ప్రదేశాలు(Tourist places), చారిత్రక కట్టడాల(Historical buildings)తో పాటు కేంద్ర రక్షిత స్మారక చిహ్నాలను ఎటువంటి ఎంట్రీ టికెట్(Entry ticket)లేకుండా చూసే అవకాశాన్ని కల్పిస్తోంది.

Telangana : పురుగుల మందు తాగి సర్పంచ్ భర్త సూసైడ్ .. కారణం అదేనంట



ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌..
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తి కావస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఈసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఎంతో అట్టహాసంగా నిర్వహిస్తోంది. దేశ వ్యాప్తంగా జాతీయభావం, దేశభక్తిని చాటుకునేందుకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే ఆగస్ట్ 5వ తేది నుంచి ఆగస్ట్ 15అంటే స్వాతంత్ర్య దినోత్సవం వరకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి చారిత్రక, కట్టడాలు, పర్యాటక ప్రాంతాల్లో ఎలాంటి ప్రవేశ రుసుము వసూలు చేయకూడదని భారత పురావస్తుశాఖ బుధవారం తెలియజేసింది. అంటే హైదరాబాద్‌లోని గోల్కొండ, చార్మినార్ వంటి కట్టడాలతో పాటు జూ పార్క్ , సాలార్‌జంగ్ మ్యూజియం వంటి వాటిలో కూడా స్థానికులకు, పర్యాటకులకు, విదేశీయులకు ఎలాంటి ఎంట్రీ టికెట్‌ లేకుండా ఉచితంగానే సందర్శనకు అనుమతించాలని సూచించింది.



నో ఎంట్రీ టికెట్ ..
దేశ వ్యాప్తంగా ఉన్న అద్భుత కట్టడాలు, రాష్ట్రాల పరిధిలో ఉన్న పురావస్తు మ్యూజియంలు, ఎగ్జిబిషన్ కేంద్రాలతో పాటు గుర్తింపు పొందిన స్మారక చిహ్నాలను కూడా ఉచితంగా సందర్శించడానికి అనుమతి ఇవ్వాలని పురావస్తుశాఖ పేర్కొంది. తెలంగాణలో అత్యంత గుర్తింపు పొందిన గోల్కొండ కోట, సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్‌, సెవెన్తో టూంబ్స్‌తో పాటు మరికొన్ని ప్రాంతాలను నగరవాసులతో పాటు పర్యాటకులు ఉచితంగా సందర్శించవచ్చని పేర్కొంది. శుక్రవారం నుంచి ఈనెల 15వ తేది వరకు ఈ సదుపాయం ప్రతి ఒక్కరికి ఉంటుందని పురావస్తుశాఖ పేర్కొంది.

మంచి అవకాశం..
హైదరాబాద్‌లో ఉండే చారిత్రక ప్రదేశాలు, పురావస్తు కేంద్రాలతో పాటు స్వాతంత్ర్య సమరయోధుల స్మారక చిహ్నాలను చూడాలనుకునే వాళ్లకు ఇదే మంచి అవకాశం. ఎలాంటి ఎంట్రీ టికెట్ లేకుండానే దేశ, రాష్ట్ర, చరిత్ర గొప్పతనాన్ని చాటి చెప్పే ప్రాంతాలను చూసే అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి.
Published by:Siva Nanduri
First published:

Tags: Charminar, Hyderabad, Telangana News

తదుపరి వార్తలు