Home /News /telangana /

HYDERABAD HIJRAS REMOVE CLOTHES CREATE NUISANCE IN HYDERABAD NERDETMET SU

Hijras: హైదరాబాద్‌లో హద్దులు దాటిన హిజ్రాలు.. పోలీసు స్టేషన్‌లోనే బట్టలు విప్పేసి..

హైదరాబాద్‌లో హద్దులు దాటిన హిజ్రాలు

హైదరాబాద్‌లో హద్దులు దాటిన హిజ్రాలు

హైదరాబాద్ నగరంలో హిజ్రాలు హల్‌చల్ చేశారు. పెళ్లి ఇంట్లో బట్టలు విప్పేసి నానా రచ్చ చేశారు. అనంతరం పోలీసు స్టేషన్‌లో కూడా ఇదే రకంగా ప్రవర్తించారు.

    హైదరాబాద్ నగరంలో హిజ్రాలు హల్‌చల్ చేశారు. నేరేడ్‌మెట్‌ ప్రాంతంలో కొందరు హిజ్రాలు బీభత్సం సృష్టించారు. పెళ్లి ఇంట్లో బట్టలు విప్పేసి నానా రచ్చ చేశారు. అనంతరం పోలీసు స్టేషన్‌లో కూడా ఇదే రకంగా ప్రవర్తించారు. దీంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కూడా కష్టతరంగా మారింది. వివరాలు.. కొందరు హిజ్రాలు గురువారం నేరేడ్‌మెట్ ప్రాంతంలోని వినాయక్ నగర్ రోడ్డు 6లోని ఓ పెళ్లి వారి ఇంటికి వెళ్లారు. అక్కడ వారిని రూ. 50 వేలు డబ్బులు డిమాండ్ చేశారు. అయితే అంత పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసేసరికి పెళ్లింటి వారు ఇవ్వడం కుదరదని చెప్పారు. దీంతో హిజ్రాలు అక్కడ అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. డబ్బులు ఇవ్వనందుకు పెళ్లివారిపై దాడి చేశారు. అంతేకాకుండా పెళ్లి వారి ముందే బట్టలు విప్పేసి షో చేశారు.

    దీంతో పెళ్లివారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని హిజ్రాలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే హిజ్రాలు పోలీస్ స్టేషన్‌లో సైతం వీరంగం సృష్టించారు. పోలీసుల ముందే బట్టలు విప్పేశారు. నగ్నప్రదర్శన చేస్తూ పోలీసులను భయపెట్టారు.

    ఈ ఘటనకు సంబంధించి పోలీసులు హిజ్రాలపై ఐపీసీ 506, 448 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకన్నారు. పోలీస్ స్టేషన్‌లో హంగామా చేసినందుకు ఐపీసీ 188, 51 (బి) డిజాస్టర్‌ మేనెజ్‌మెంట్‌ కింద మరో కేసు నమోదు చేశారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Crime news, Hyderabad, Transgender

    తదుపరి వార్తలు