పోలీసులు పటిష్ట నిఘా పెట్టినా.. కఠినంగా వ్యవహరిస్తున్నా.. హైదరాబాద్ (Hyderabad) వ్యభిచార ముఠాలు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నాయి. చట్టాలకు భయపడేదే లేదంటూ.. తమ పని తాము చేసుకుంటూ పోతున్నాయి. నగరంలో రోజు రోజుకూ ఈ ముఠాల సంఖ్య పెరుగుతోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి.. వ్యభిచార దందాను చేస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి యువతలను రప్పించి.. చీకటి వ్యాపారం నిర్వహిస్తున్నాయి. అందమైన.. ఆకట్టును ఫొటోలను ఎరగా వేసి.. యువతను ఆకర్షిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో మరో హైటెక్ వ్యభిచార ముఠా (High tech prostitution Rackect) పోలీసులకు చిక్కింది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ముంబై, పశ్చిమ బెంగాల్‌కు చెందిన కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి.. హైదరాబాద్‌లో వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రత్యేకమైన కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసి.. మనదేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన యువతలను ట్రాప్ చేస్తున్నారు. లక్షలు ఆశచూసి.. విలాస జీవితమని మభ్యపెట్టి.. హైదరాబాద్‌కు రప్పిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా.. అంతా ఆన్‌లైన్‌లో వ్యభిచార దందా చేస్తున్నారు. వీరి వద్ద ఉండే అమ్మాయిలు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో రూమ్‌లు, హాస్టల్స్‌లో ఉంటారు. స్కోక్కా. ఇన్, లోకాంటో, వివా స్ట్రీట్ తదితర వెబ్‌సైట్లలో వీరి ఫొటోలను ఉంచి.. యువతను ఆకర్షిస్తున్నారు. కేవలం వాట్సప్ ద్వారానే వీరిని సంప్రదించాల్సి ఉంటుంది. డీల్ కుదిరిన తర్వాత.. అమ్మాయి, అబ్బాయిని ఓయో రూమ్స్, ఇతర హోటల్స్‌కి పంపిస్తారు. ఇలా చాలా కాలంగా నగరంలో ఈ హైటెక్ వ్యభిచార ముఠా దందా జరుగుతోంది.
సైబరాబాద్ పోలీసులకు పక్కాగా సమాచారం అందడంతో.. హైటెక్ వ్యభిచార ముఠాపై కొన్ని రోజులుగా ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే శుక్రవారం వారి గుట్టును రట్టును చేశారు. మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వీరిలో కొందరు ముంబై..మరికొందరు పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారు ఉన్నారు. నిందితుల నుంచి 31 స్మార్ట్ ఫోన్లు, నాలుగు ఫీచర్ ఫోన్లు, ఐదు ల్యాప్ టాప్‌లు, రెండు ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఏటీఎం కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐతే అరెస్టైన వారిలో ఓ సినీ రచయిత ఉండడం షాక్‌కు గురిచేసింది. బాలీవుడ్ సినీ రచయిత మోహిత్ గార్గ్ ఈ ముఠాలో సభ్యుడిగా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. అరెస్టైన పలువురిపై గతంలోనూ ఉమెన్ ట్రాఫికింగ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. వీరి వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Local News, Telangana