12 మంది ఆలిండియా అధికారుల కేడర్ కేటాయింపుపై నేడు తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో విచారణ జరిగింది. ఈ మేరకు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రెగ్యులర్ బెంచ్ ఈ పిటీషన్లపై విచారణ జరుపుతుందని కోర్టు పేర్కొంది. మరోవైపు వ్యక్తిగత వాదనలు వినిపిస్తామని పిటీషనర్ల తరపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనితో తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది.
2014లో రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి 12 మంది ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు అలాట్ అయ్యారు. అయితే తమ కేడర్ కేటాయింపును సవాల్ చేస్తూ క్యాట్ ను ఆశ్రయించారు. దీనితో ఈ 12 మంది అధికారులకు అనుకూలంగా క్యాట్ తీర్పునిచ్చింది. దీనితో వీరంతా తెలంగాణలో కొనసాగుతున్నారు. అయితే తాజాగా క్యాట్ తీర్పును కేంద్రం సవాల్ చేసింది. ఈ మేరకు హైకోర్టు (High Court)లో పిటీషన్ దాఖలు చేయగా నేడు విచారణ జరిగింది. ఈ మేరకు జనవరి 27న తెలంగాణ హైకోర్టు (High Court) రెగ్యులర్ బెంచ్ విచారణ చేయనుంది. తెలంగాణ హైకోర్టు (High Court) చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేయనుంది.
కొన్నిరోజుల ముందు తెలంగాణ సీఎస్ గా ఉన్న సోమేశ్ కుమార్ ను ఏపీకి వెళ్లాలని కోర్టు ఆదేశించింది. దీనితో ఆయన ఏపీకి వెళ్లగా ఆ స్థానంలో శాంతికుమారి బాధ్యతలు చేపట్టారు. అయితే సోమేశ్ కుమార్ (CS Somesh Kumar) సహా కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఏపీకి చెందిన వారు. వీరందరిని కూడా రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం నియమించింది. అయితే వీరంతా (CAT) కేంద్ర పరిపాలన టిబ్యునల్ దగ్గర పర్మిషన్ తీసుకొని తెలంగాణకు వచ్చారు. దీనితో కేంద్రం 2017లోనే కోర్టును ఆశ్రయించింది. దీనితో అప్పటి నుంచి కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. సోమేశ్ కుమార్ బదిలీతో ఈ విచారణ వేగవంతం అయింది. ఈ క్రమంలో నేడు ఈ అంశంపై హైకోర్టులో కీలక వ్యాఖ్యలు చేసింది.
ప్రస్తుతం తెలంగాణ డీజీపీగా ఉన్న అంజనీ కుమార్ (Anjani Kumar) కూడా ఈ అధికారుల్లో ఒకరు. అయితే అంజనీ కుమార్ ని ఏపీకి బదిలీ చేస్తే ఆ స్థానంలో కొత్త డీజీపీ రావాల్సి ఉంటుంది. అలాగే ఆయా అధికారుల స్థానాల్లో కొత్తవారిని నియమించాల్సి ఉంటుంది. జనవరి 27న జరిగే విచారణలో వీరి కేడర్ పై హైకోర్టు కీలక తీర్పు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.