గణేష్(Ganesh) ఉత్సవాలు, నిమజ్జనంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది, హుస్సేన్‌సాగర్‌లో(Hussain Sagar) నిమజ్జనంపై ఈసారి ఆంక్షలు విధించింది. గణేశ్, దుర్గాదేవి(Durgadevi) విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయకుండా తగిన ఆదేశాలు జారీ చేయాలంటూ గతంలో న్యాయవాది మామిడి వేణుమాధవ్ వేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం ఇటీవల సుదీర్ఘంగా విచారణ జరిపింది. దీనిపై వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వు చేసింది హైకోర్టు(High court).. తాజాగా గురువారం తీర్పును వెల్లడించింది. నిమజ్జనం సమయంలో కొవిడ్ పరిస్థితులు, కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని.. ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తూనే.. ప్రస్తుత పరిస్థితులపై కూడా ఫోకస్ పెట్టాలని తెలిపింది హైకోర్టు.
ఎక్కడికక్కడ స్థానికంగానే నిమజ్జనం చేస్తే బాగుంటుందన్న హైకోర్టు సామూహిక నిమజ్జనంతో హుస్సేన్‌సాగర్ దెబ్బతినకుండా చూడాలని సూచించింది. చిన్న, పర్యావరణహిత విగ్రహాలను ప్రోత్సహించాలని హైకోర్టు హితవు పలికింది. హుస్సేన్‌సాగర్‌లో ట్యాంక్‌బండ్ వైపు నుంచి నిమజ్జనం చేయొద్దని.. పీవీ మార్గ్, నెక్లెస్‌రోడ్డు, సంజీవయ్య పార్కు రోడ్డు తదితర మిగతా ప్రాంతాల్లో చేసుకోవచ్చని హైకోర్టు పేర్కొంది. ఈ ఆంక్షలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశంచింది. హుస్సేన్‌సాగర్‌లో పూర్తిగా కాకుండా ప్రత్యేకంగా రబ్బర్ డ్యాం డ్యామ్ ఒకటి ఏర్పాటు చేసి అందులో నిమజ్జనం చేయాలని ఆదేశించింది.
ఎవరి ఇళ్లల్లో వాళ్లే చిన్న బకెట్లను ఏర్పాటు చేసుకొని నిమజ్జనం చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా..కర్నాటకలో బీజేపీ (BJP) ఆధ్వర్యంలోని ప్రభుత్వం (government) నడుస్తోంది. అక్కడ రాజధాని నగరం బెంగళూరు (Bangalore). బృహత్ బెంగళూరు మహా నగర పాలిక (BBMP) వినాయక చవితి ఉత్సవాలపై బుధవారం ఆదేశాలు జారీచేసింది. వినాయక చవితి రోజైన సెప్టెంబర్ 10న జంతు వధ (Animal slaughter), మాంసం విక్రయాలపై (Meat selling) నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ(ANI) తన కథనంలో పేర్కొంది.
నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని నగర పాలిక సంస్థ హెచ్చరించింది. సెప్టెంబర్ 10 నుంచి నగరంలో మూడు రోజుల గణేశ పూజ వేడుకలను మాత్రమే బహిరంగ ప్రదేశాలలో అనుమతించింది. BBMP చీఫ్ కమిషనర్ గౌరవ్ గుప్తా మాట్లాడుతూ.. బెంగళూరు నగరంలో గణేశ ఉత్సవాన్ని(Ganesh celebrations) మూడు రోజులకు మించి అనుమతించబోమని, విగ్రహాన్ని తీసుకువచ్చేటప్పుడు లేదా నిమజ్జనం చేసే సమయంలో ఎలాంటి ఊరేగింపు ఉండరాదని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.