హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nithiin: కాషాయం ధరించిన నితిన్... హోటల్ ప్రారంభించిన యంగ్ హీరో..!

Nithiin: కాషాయం ధరించిన నితిన్... హోటల్ ప్రారంభించిన యంగ్ హీరో..!

నితిన్

నితిన్

హైదారబాద్‌లో యంగ్ హీరో నితిన్ సందడి చేశారు. పలువురు సినీ ప్రముఖులతో కలిసి ఆయన సిటీలో బాబాయ్ హోటల్ ప్రారంభించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

టాలీవుడ్ యంగ్ హీరోల్లో... నితిన్‌ ఒకరు.ఇటీవలే.. మాచర్ల నియోజకవర్గం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే తాజాగా నితిన్ కాషాయం బట్టల్లో కనిపించారు. ఆయనఆంజనేయస్వామి దీక్షకు దిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాషాయ రంగు దుస్తుల్లో కనిపించి అందరికీ సర్‌ప్రైజ్‌ చేశాడు. ఈవిషయాన్ని ఆయనే సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు తెలియజేశాడు, అంతకు ముందు ఆయన భీష్మ సమయంలో హనుమాన్‌ దీక్ష తీసుకున్నారు.

హైదరాబాద్‌లో బాబాయ్ హోటల్ బ్రాంచ్‌ను నితిన్‌ చేతుల మీదుగా మణికొండలో ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన సిటీలో సందడి చేశారు.   8 దశాబ్దాలుగా విజయవాడ నగర వాసులకు రుచికరమైన భోజనాన్ని అందిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను గుర్తింపు తెచ్చుకుంది బాబాయ్‌ హోటల్. డైరెక్టర్ శశికాంత్ తన స్నేహితులతో కలిసి ఫ్రెండ్స్ ఫ్యాక్టరీని స్థాపించారు. ఫ్రెండ్స్ ఫ్యాక్టరీ పేరు మీదే ఈ బాబాయ్ హోటల్‌ను హైదరాబాద్‌లోని మణికొండలో ప్రారంభించారు. ప్రముఖ నిర్మాత సుధాకర్ రెడ్డి, డైరెక్టర్ వెంకీ కుడుముల, రామ జోగయ్య శాస్త్రి, రచయిత దర్శకుడు వక్కంతం వంశీ, నిర్మాత ఠాగూర్ మధు తదితరులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు.

భీష్మ తర్వాత తన స్థాయికి తగ్గ హిట్‌ను సాధించలేకపోతున్నాడు నితిన్‌. ఈ తర్వాత అతను నటించిన చెక్‌, రంగ్‌దే, మ్యాస్ట్రో, మాచెర్ల నియోజకవర్గం చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడ్డాయి. ప్రస్తుతం ఆయన వక్కంతం వంశీతో జతకట్టారు. అల్లు అర్జున్‌' నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' తో డైరెక్టర్‌గా మారారు వక్కంతం వంశీ. మరోవైపు నితిన్ వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా నటించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా బాబాయ్‌ హోటల్ ప్రారంభోత్సవంలో వెంకీ కుడుమలతో కనిపించడం ఈ క్రేజీ కాంబినేషన్‌ ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతోంది.

First published:

Tags: Hyderabad, Local News, Nithiin

ఉత్తమ కథలు