ఎదురింటి యువకుడితో తరచూ ఫోన్ కాల్స్.. విషయం భర్తకు తెలవడంతో ఇంట్లో గొడవ.. చివరకు ఆమె ముగ్గురు కూతుళ్లతో..

ప్రతీకాత్మక చిత్రం

Extramarital Affair: ఇంట్లో భర్తతో గొడవ పడి ఆమె తన ముగ్గురు పిల్లలతో కలిసి బయటకు వెళ్లింది. ఇంకా తిరిగి ఇంటికి రాకపోవడంతో భర్త హైదరాబాద్‌లోని కామాటిపురా పోలీస్‌స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. తర్వాత ఏం జరిగిందంటే.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  ఆమెకు పదహారేళ్ల క్రితం పెళ్లయింది. ఆమెకు ముగ్గురు ఆడపిల్లలు సంతానం. మూడేళ్ల కిందట ఆమె తన ఇంటికి ఎదురుగా ఉండే యువకుడితో ప్రతీ రోజు ఫోన్లో మాట్లాడేది. విషయం తెలిసిన భర్త మందలించాడు. దీంతో వాళ్లు ఉండే ప్రదేశం నుంచి ఎనిమిది నెలల క్రితం మరో ప్రదేశానికి మారారు. ఇది తెలిసిన ఎదురింటి వ్యక్తి కూడా వాళ్లు వెళ్లిన ప్రదేశానికి తన మకాం కూడా మార్చాడు. వీరిద్దరి మధ్య మళ్లీ ఫోన్ కాల్స్ ఎక్కువ అయ్యాయి. సదరు వ్యక్తితో మళ్లీ సంబంధం పెట్టుకొని ఫోన్ మాట్లాడుతున్నావంటూ తన భార్యను మళ్లీ మందలించాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ పెరిగింది. ఒకిరినొకరు వాగ్వాదం చేసుకున్నారు. ఇది గమనించిన ముగ్గురు కూతుళ్లు వాళ్లను ఆపే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఇలా నాలుగైదు రోజులు చీటికి మాటికి గొడవ పెట్టుకుంటుండటంతో ఓ రోజు భార్య తిరుపతి వెళ్తున్నాని చెప్పి ముగ్గురు కూతుళ్లను తనతో తీసుకెళ్లింది. ఈ నెల 16 న సంఘటన జరగ్గా ఇప్పటి వరకు వాళ్లు తిరిగి రాకపోవడంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని కామాటిపురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  కామాటిపురాలో మురళీ గుమ్మాస్‌ ప్రాంతానికి చెందిన కిషన్‌ శర్మ, పూజ ఆలియాస్‌ రాగిణి (34) దంపతులు. వీరికి 16 ఏళ్ల క్రితం వివాహం కాగా.. ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. మూడేళ్ల కిందట మలక్‌పేట్‌లో నివసించే సమయంలో ఇంటికి ఎదురుగా ఉన్న పవన్‌ (30)తో పూజ తరచుగా మాట్లాడేది. ప్రతీరోజు ఫోన్ మాట్లాడటంతో పాటు తరచూ ఇంట్లో ఉన్న కూతుళ్లను పట్టించుకోకపోయేది. ఈ విషయమై భర్త కిషన్‌ శర్మ పవన్‌ను మందలించాడు. ఇంకో సారి ఇలాంటి ఫోన్ కాల్స్ మాట్లాడితే బాగుండదని హెచ్చరించాడు. దీంతో అక్కడ నుంచి 8 నెలల కిందట కామాటిపురాలోని మురళీ గుమ్మాస్‌కు మకాం మార్చారు.

  ఈ విషయం పవన్ కు తెలిసింది. అయితే పవన్‌ కూడా ఇటీవల తన నివాసాన్ని మురళీ గుమ్మాస్‌కు మార్చాడు. అక్కడ కూడా ఆమె తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండడంతో పూజతో కిషన్‌ శర్మ గొడవ పడగా.. ఈ నెల 16వ తేదీన పూజ తన ముగ్గురు కూతుళ్లు కీర్తి (15), మీనా (14), మోహిని (12)తో తిరుపతి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లి పోయింది. ఇప్పటివరకు ఆమె తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తన భర్త కిషన్‌ శర్మ కామాటిపురా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
  Published by:Veera Babu
  First published: