HYDERABAD HEAVY RAINS IN NEXT TWO DAYS IN ANDHRA PRADESH AND TELANGANA ORANGE ALERT FOR SOME DISTRICTS NGS VSP
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎల్లుండి భారీ వానలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
ప్రతీకాత్మకచిత్రం
ఏపీ తెలంగాణల్లో ఇప్పటికే పలు జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్తితి కొనసాగుతుందిన వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అంతేకాదు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఏఏ జిల్లాలో తెలుసా..?
AP–Telanagana Rains: తెలుగు రాష్ట్రాలను భారీ వానలు ముంచెత్తుతున్నాయి. ప్రస్తుతం రుతు పవనాలు చురుగ్గా మారాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చాలా చోట్ల వానలు దంచి కొడుతున్నాయి. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బుధ, గురు వారాల్లో ఏపీ,త తెలంగాణ రెండు రాష్టాల్లోనూ పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి. ఒకటి రెండు ప్రదేశాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వెల్లడించాయి. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య పరిసరాల్లోని ఉత్తర ఆంధ్రా,దక్షిణ ఒడిస్సా తీరంల దగ్గర కొనసాగిన అల్పపీడనం ఈ రోజు బలహీన పడింది. దానికి అనుబంధంగా ఉన్న ద్రోణి దక్షిణ ఒడిశా నుంచి ఉత్తర కోస్తా ఆంద్రా మీద కొనసాగుతూ మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయి వరకు వ్యాపించి నైరుతి వైపు కొనసాగుతోంది. ఆ కారణంతో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. దీంతో పగటిపూట ఉష్ణోగ్రతలు తగ్గాయి.
హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్ర మంతా భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. మరో మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండనుంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారీ వర్షాల పడుతున్న సమయంలో ప్రజలంతా ఇంటికే పరిమితమవ్వాలని.. ఎవరూ బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. పిడుగులు పడే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమై ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందంటూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.
ఇక ఏపీ విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తారంధ్రలో పలు చోట్ట ఇప్పటికే వానలు దంచి కొడుతున్నాయి. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.