హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rain Alert : మూడు రోజులు భారీ వర్షాలు

Rain Alert : మూడు రోజులు భారీ వర్షాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

 Rain Alert : పశ్చిమ మధ్య బంగాళాఖాతం,దాని పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Rain Alert : రానున్న మూడు రోజుల్లో కోస్తాంధ్రలో అనేక చోట్ల,రాయలసీమలో ఒకి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం,దాని పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు, ఇవాళ-రేపు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

మరోవైపు, హైదరాబాద్ లో,సోమవారం కుండపోత వర్షం కురిసింది. సోమవారం సాయంత్రం 5 గంటలకు మొదలైన వాన రాత్రి 8 గంటల వరకూ కురుస్తూనే ఉంది. భారీ వర్షంతో హైదరాబాద్ ఉక్కిరిబిక్కిరైంది. కార్యాలయాల నుంచి ఉద్యోగులు ఇళ్లకు చేరే సమయం కావడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్​ స్తంభించిపోయింది. నగరంలో గత పదేళ్లలో సెప్టెంబర్​లో ఎన్నడూ లేనంత అధిక వర్షపాతం నమోదైంది. అర్ధరాత్రి 12 గంటలకు అత్యధికంగా నగర శివారులోని నందనం వద్ద 16.7, మెహిదీపట్నంలో 11.25, నాంపల్లిలో 10.33 సెంటీమీటర్లు కురిసింది. గతంలో 2017 సెప్టెంబరు 6న 24 గంటల వ్యవధిలో 9 సెంటీమీటర్ల రికార్డు వర్షం పడింది. సోమవారం 3 గంటల వ్యవధిలోనే పలు ప్రాంతాల్లో అధిక వర్షం పడటంతో కొత్త రికార్డు నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురవడంతో వాగులు, వంకలు, నాలాలు పొంగిపొర్లాయి. కొన్నిచోట్ల రహదారులు చెరువులను తలపించాయి. ఉస్మాన్ గంజ్ ​ఏరియాలో రోడ్లపైకి భారీగా వరదనీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటల తరబడి ట్రాఫిక్​ జామ్ ఏర్పడింది. సహాయ చర్యల కోసం జీహెచ్ఎంసీ, డీఆర్​ఎఫ్​ బృందాలను రంగంలోకి దించారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Andhra Pradesh, Heavy Rains, Telangana

ఉత్తమ కథలు