హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rain alert: తెలంగాణకు భారీ వర్ష సూచన .. రెయిన్ ఎఫెక్ట్ ఎన్ని రోజులంటే ..?

Rain alert: తెలంగాణకు భారీ వర్ష సూచన .. రెయిన్ ఎఫెక్ట్ ఎన్ని రోజులంటే ..?

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

Rain alert: హైదరాబాద్‌కు మరోసారి వరుణగండం పొంచి ఉంది. రాబోయే 48గంటల్లో జంటనగరాలతో పాటు రాష్ట్రంలోని 12 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

హైదరాబాద్‌(Hyderabad)కు మరోసారి వరుణగండం పొంచి ఉంది. రాబోయే 48గంటల్లో జంటనగరాలతో పాటు రాష్ట్రంలోని 12 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు(Heavy rains) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం((HIMD) హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావమే ఇందుకు కారణమని ఐఎండీ పేర్కొంది. తెలంగాణకు భారీ వర్ష సూచన హెచ్చరికలతో ఎల్లో అలర్ట్ (Yellow alert)జారీ చేశారు అధికారులు. ఎక్కువ శాతం వర్షపాతం నమోదయ్యే జిల్లాల్లో అధికారులు తగిన ముందస్తు ఏర్పాట్లు చేసుకొని అప్రమత్తమయ్యారు.

కొడాలి నాని లారీలు కడుక్కునే టైంలోనే కార్పొరేటర్‌ని .. గుడివాడలో పోటీ చేసి గెలుస్తా : రేణుకాచౌదరి

రెండ్రోజులు భారీ వర్షాలే ..

తెలంగాణలో వాతావరణం చల్లబడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం కారణంగా రాగల రెండు రోజుల్లో హైదరాబాద్‌తో పాటు ఉత్తర, ఈశాన్య, తూర్పు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అంతే కాదు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ క్రమంలో రాబోయే రెండు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఎల్లో అలర్ట్ జారీ ..

ముఖ్యంగా రాబోయే రెండు రోజుల్లో సాయంత్రం, రాత్రి సమయాల్లోనే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో మంచిర్యాల, జగిత్యాల , ములుగు, కరీంనగర్ , భద్రాద్రి కొత్తగూడెం , ఖమ్మం , మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, వరంగల్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దాంతో, ఆ జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Telangana rains, Telangana Weather

ఉత్తమ కథలు