Heavy Rain: హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు..

(Image-Twitter)

ఇప్పటికే శుక్రవారం కురిసిన భారీ వర్షాలకు నగరంలోని పలు కాలనీలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. నిన్న కురిసిన వర్షం వల్ల అవస్థలు పడుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు.. మరోసారి భారీ వర్షం కురవడంతో ఆందోళన చెందుతున్నారు.

  • Share this:
    హైదరాబాద్‌లో మరోసారి కుండపోత వర్షం (Heavy Rain In Hyderabad) కురుస్తోంది. సికింద్రాబాద్‌, అల్వాల్, తిరుమలగిరి, సీతాఫల్‌మండి, దిల్‌సుఖ్‌నగర్‌, సరూర్‌నగర్‌, కుషాయిగూడ, చెంగిచెర్ల, ఉప్పల్‌, రాంనగర్‌, ముషిరాబాద్‌, ఖైరతాబాద్‌, అమీర్‌పేట్‌, పంజాగుట్ట, లక్డీకాపూల్‌, చంపాపేట, సైదాబాద్‌, చైతన్యపురి, ఎల్‌బీ నగర్, వనస్థలిపురం అంబర్‌పేట్, కాచీగూడ, నల్లకుంట, నాంపల్లి, నాగోల్‌, బంజారాహిల్స్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వానపడింది. దీంతో పలుచోట్ల రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. కొన్ని చోట్ల ట్రాఫిక్‌‌ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బషీర్‌బాగ్ నుంచి కింగ్ కోఠి వైపు వెళ్లే మార్గంలో భారీగా వరద నీరు చేరింది. అంబర్‌పేట్‌, కాచిగూడలో నాలాలు పొంగి రోడ్లపై వరద నీరు రోడ్లపైకి చేరుతోంది.

    కుండపోత వర్షానికి పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌, అసెంబ్లీ ముందు రహదారిపై భారీగా నీరు చేరింది. దీంతో ఎంజే మార్కెట్‌, నాంపల్లి నుంచి అసెంబ్లీ, లక్డీకాపూల్‌ వరకు భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక, నగరంలోని చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

    Hyderabad Rains: సినిమా థియేటర్‌ను ముంచెత్తిన వరద నీరు.. ప్రేక్షకులకు భారీ షాక్.. ప్రహరీ గోడ కూలి..

    ఇప్పటికే శుక్రవారం కురిసిన భారీ వర్షాలకు నగరంలోని పలు కాలనీలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. నిన్న కురిసిన వర్షం వల్ల అవస్థలు పడుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు.. మరోసారి భారీ వర్షం కురవడంతో ఆందోళన చెందుతున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో గంట పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.





    హైదరాబాద్ లోని జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ చెరువులకు వరద ప్రవాహం పోటెత్తింది. ఈ నేపథ్యంలో అధికారులు రెండు చెరువుల నుంచి మూసీ నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. హిమాయత్‌ సాగర్ 8 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.

    శనివారం మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ నగరంలో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు హెచ్చరించిన విషయం తెలిసిందే. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు. ప్రజలు సహాయం కోసం 040-21111111 సంప్రదించాలని అధికారులు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
    Published by:Sumanth Kanukula
    First published: