Home /News /telangana /

HYDERABAD HEAVY RAIN IN SEVERAL PARTS OF HYDERABAD OFFICIALS ISSUED YELLOW ALERT TWITTER REACTIONS MKS

Hyderabad rains: వాన బీభత్సం -గ్యాప్ లేకుండా దంచుతోంది -Yellow alert జారీ -బయటికి రాకుంటే బెటర్

హైదరాబాద్ లో భారీ వర్షం

హైదరాబాద్ లో భారీ వర్షం

Hyderabad rains:రాజధాని హైదరాబాద్ లో వాన బీభత్సం కొనసాగుతున్నది. మధ్యాహ్నం నుంచి గ్యాప్ లేకుండా భారీ వర్షం కురుస్తున్నది. ఇప్పటికే చాలా ప్రాంతాలు జలమయం అయిపోగా, రాబోయే కొద్ది గంటల్లో మరిన్ని భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు యెల్లో అలర్ట్ సైతం జారీ చేశారు. నగర ప్రజలు ఇప్పుడప్పుడే బయటికి రాకపోవడం మంచిదని హెచ్చరిస్తున్నారు..

ఇంకా చదవండి ...
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో కుండపోతలా వర్షం పడుతోంది. ఇది చాలదన్నట్లు మరికొద్ది గంటల్లో భారీవర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. చాలా ప్రాంతాలు జలమయం అయిన నేపథ్యంలో వరద ఉధృతి తగ్గేదాకా జనం బయటికి రాకపోవడమే మంచిదని హెచ్చరికలు వెలువడుతున్నాయి..

తూర్పు మధ్య, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని లక్షద్వీప్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. అయితే అంచనా వేసినదానికంటే అతి భారీగా నగరంలో వర్షం కురిసింది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు, అత్యధికంగా హయత్ నగర్ లో 37.8మిల్లీ మీటర్లు, ఆసిఫ్ నగర్ లో 34.3 మి.మీ వర్షపాతం నమోదైంది.



నగరంలోని బంజారాహిల్స్‌, ఖైర‌తాబాద్, జూబ్లీహిల్స్, కొండాపూర్, హైటెక్‌సిటీ, సోమాజిగూడ‌, బేగంపేట‌, సికింద్రాబాద్, తార్నాక‌, ఉప్ప‌ల్, ఎల్బీన‌గ‌ర్‌, దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌, హయ‌త్‌న‌గ‌ర్‌, సంతోష్‌న‌గ‌ర్‌, చాద‌ర్‌ఘాట్‌, కోఠి, అఫ్జ‌ల్ గంజ్, జియ‌గూడ‌, లంగ‌ర్‌హౌజ్, ల‌క్డీకాపూల్, మెహిదీప‌ట్నం, టోలిచౌకీతో పాటు ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షం కురిసింది. ఆయా ఏరియాల్లోని లోటత్తు ప్రాంతాలు నీట మునిగాయి. జీహెచ్ఎంసీ, పోలీస్ విభాగం వారు సహాయక చర్యలు మొదలుపెట్టారు



తెలంగాణలో రాబోయే కొన్ని రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశముందని తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించింది. రాజధాని నగరమైన హైదరాబాద్ నగరంలో శనివారం ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని ఇవాళ ఉదయమే ఐఎండీ అంచనా వేసింది. మరోవైపు.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో అక్టోబర్ 19 వరకు ఒడిశాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవవచ్చని ఐఎండీ అధికారులు హెచ్చరిక జారీ చేశారు.





అటు ఏపీలోనూ ఉత్తరాంధ్రకు భారీ వర్షసూచన జారీ అయింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని ఐఎండీ అధికారులు సూచించారు. ఉత్తర కోస్తాంధ్రలోని చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు కేరళలోని ఉత్తర జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు. కేరళలో శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.
Published by:Madhu Kota
First published:

Tags: Greater hyderabad, Hyderabad Rains, Telangana rains

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు