హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: హైదరాబాద్‌లో వడగళ్ల వాన బీభత్సం..కాశ్మీర్‌లా మారిన సిటీ..!

Hyderabad: హైదరాబాద్‌లో వడగళ్ల వాన బీభత్సం..కాశ్మీర్‌లా మారిన సిటీ..!

హైదరాబాద్‌లో వడగళ్ల వాన

హైదరాబాద్‌లో వడగళ్ల వాన

Hyderabad: తెలంగాణలో మరో రెండు మూడు రోజుల పాటు ఇదే రకమైన వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఉపరితల ద్రోణి కారణంగా గత మూడు రోజులుగా ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌ (Hyderabad) కూడా వానలు పడుతున్నాయి. ఇవాళ సాయంత్రం మరోసారి వాన దంచి కొట్టింది. ఈదురు గాలులు, వడగళ్ల (Hailstorm) తో వర్షం కురిసింది. రోడ్లపై వడగళ్లు పడడంతో.. నగర రోడ్లు, వీధులు కాశ్మీర్ లోయను తలపించాయి. కూకట్‌పల్లి, మూసాపేట, నిజాంపేట్, మియాపూర్, సూరారంలో వడగళ్లు పడ్డాయి. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, మణికొండ, ఫిల్మ్‌నగర్, షేక్‌పేట, నార్సింగ్, టోలీచౌకి, మెహిదీపట్నం, అమీర్‌పేట, బేగంపేట, సికింద్రాబాద్, తార్నాక, నాచారం, ఉప్పల్ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది.

హైదరాబాద్‌ నగరంలో పలు చోట్ల వడగళ్లు కురవడంతో.. వాటిని ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు. ఎప్పుడో చిన్నప్పుడు ఇలాంటి మంచుగడ్డలను చూశామని.. మళ్లీ ఇన్నాళ్లకు హైదరాబాద్‌లో చూస్తున్నామని సంబరపడుతున్నారు.

తెలంగాణలో మరో రెండు మూడు రోజుల పాటు ఇదే రకమైన వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

First published:

Tags: Heavy Rains, Hyderabad, Local News, Telangana

ఉత్తమ కథలు