ఉపరితల ద్రోణి కారణంగా గత మూడు రోజులుగా ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ (Hyderabad) కూడా వానలు పడుతున్నాయి. ఇవాళ సాయంత్రం మరోసారి వాన దంచి కొట్టింది. ఈదురు గాలులు, వడగళ్ల (Hailstorm) తో వర్షం కురిసింది. రోడ్లపై వడగళ్లు పడడంతో.. నగర రోడ్లు, వీధులు కాశ్మీర్ లోయను తలపించాయి. కూకట్పల్లి, మూసాపేట, నిజాంపేట్, మియాపూర్, సూరారంలో వడగళ్లు పడ్డాయి. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, మణికొండ, ఫిల్మ్‌నగర్, షేక్‌పేట, నార్సింగ్, టోలీచౌకి, మెహిదీపట్నం, అమీర్‌పేట, బేగంపేట, సికింద్రాబాద్, తార్నాక, నాచారం, ఉప్పల్ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది.
హైదరాబాద్ నగరంలో పలు చోట్ల వడగళ్లు కురవడంతో.. వాటిని ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు. ఎప్పుడో చిన్నప్పుడు ఇలాంటి మంచుగడ్డలను చూశామని.. మళ్లీ ఇన్నాళ్లకు హైదరాబాద్‌లో చూస్తున్నామని సంబరపడుతున్నారు.
Haven’t seen something like this for a long time. This is happening in Hyderabad now #Hyderabad #HyderabadRains #hailstrom pic.twitter.com/x3AETDXEDV
— Narendra Nerla (@nerlanr) March 18, 2023
హైదరాబాద్ లో వడగళ్ల వాన????#Hyderabad pic.twitter.com/QYe3dU5Hbw
— Nageshwar Rao (@itsmeKNR) March 18, 2023
Hailstorm in #Kukatpally #Hyderabad #HyderabadRains #HailstormInHyderabad #Hailstorm Stay safe guys pic.twitter.com/NSmmB03GOt
— Revathi (@revathitweets) March 18, 2023
#Hyderabad lo e varsham entra.. Zudio pakkana e kadha ani bike vesuku vellamu.. Vadagalla vana.. Medha paddai hail stones. Vasipoindhi.. Eppudo chinnappudu chusa.. Malli ippudu chudatam..#hailstorm #hailstones #HyderabadRains pic.twitter.com/QRj4x4fXI8
— Ramya1494???????? (@ramyasri1494) March 18, 2023
Hailstorm at #Hyderabad in mid March. Summer treat or nature’s furry ? Courtesy @Ananya00579885 @santoshkrs #ClimateAction pic.twitter.com/hatooW3G2b
— Dr Ansuman Das (@ansumandas202) March 18, 2023
@ Miyapur Metro Station ☔️⛈⛈#HyderabadRains #KTREffect #Hyderabad #Telangana pic.twitter.com/n95vTWAZdZ
— Srinivas Reddy???????? (@reddycnuk) March 18, 2023
వడగండ్ల వాన జోరుగా ..!!⛈️????#HailStrom in #Hyderabad ⚡️☔️#Rain #Weather #Mausam #Baarish #hyderabadweather pic.twitter.com/Qb0VMMmIgB
— ARPITHA PRAKASH (@ARPITHABRS) March 18, 2023
తెలంగాణలో మరో రెండు మూడు రోజుల పాటు ఇదే రకమైన వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Heavy Rains, Hyderabad, Local News, Telangana