HYDERABAD HE WAS SENTENCED TO 20 YEARS IN PRISON FOR CHEATING ON A GIRL IN THE BELIEF THAT HE WOULD MARRY HER VB
గదిలో కూర్చొని చదువుకోకుండా ఇదేం పాడుబుద్ది.. ఆ బాలికను రూంకి రప్పించి.. ఇతగాడు చేసిన ఘనకార్యం ఇది..
నిందితుడు మాల అంజయ్య
Crime News: ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన మహిళలపై హత్యలు, అత్యాచారలు ఆగడం లేదు. నిర్భయ, దిశ లాంటి చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల్లో మాత్రం చలనం రావడం లేదు. ఆరు నెలల పాప నుంచి నూట ఆరేళ్ల పండు ముసలవ్వ వరకు ఎవరినీ వదలడం లేదు.
ఎన్ని చట్టాలుతీసుకొచ్చినా మహిళలపై హత్యలు (Murder) , అత్యాచారాలు (Rape) ఆగడం లేదు. నిర్భయ, దిశ లాంటి చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల్లో మాత్రం చలనం రావడం లేదు. ఆరు నెలల పాప నుంచి నూట ఆరేళ్ల పండు ముసలవ్వ వరకు ఎవరినీ వదలడం లేదు. అంతే కాకుండా ఈ మధ్య సామూహిక లైంగిక దాడులు ఎక్కువ అయ్యాయి. జరిగిన విషయాన్ని ఇంట్లో చెబితే చంపేస్తామనడమో.. సీక్రెట్ గా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామనడమో ఎదో ఒకటి చెప్పి వాళ్లను బెదిరించి లొంగదీసుకుంటున్నారు. ఎక్కువగా ఈ మృగాళ్లు మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.
ఈ ఘటనలే కాకుండా పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. శారీరకంగా లొంగదీసుకొని పెళ్లి చేసుకోకుండా నిరాకరించి అమ్మాయిలను మోంస చేస్తున్న ఘటనలు ఎక్కువగా అవుతున్నాయి. ఇలాంటి ఘటనే ఒకటి రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ బాలికపై అత్యాచారం చేశాడు. ఈ నిందితుడికి కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో సెషన్స్ కోర్టు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
చేవెళ్ల మండలం యెంకన్నగూడెంకు చెందిన 25 ఏళ్ల మాల అంజయ్య 2015లో మండల కేంద్రంలో అద్దె గదిలో ఉంటూ డిగ్రీ చదివేవాడు. చదువుకుంటూ అన కాలేజీకి వెళ్తూ డిగ్రీ పూర్తి చేశాడు. ఆ మండల కేంద్రంలోనే ఓ 16 ఏళ్ల బాలికతో అతడికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని అతడు అనువుగా మార్చుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. మాయమాటలు చెప్పి తన గదికి రప్పించుకున్నాడు. శారీరకంగా దగ్గర అయ్యాడు.
ఇలా ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు.. అంటూ ఓ రోజు చెప్పేశాడు. దీంతో ఆ బాలిక ఎవరికీ చెప్పాలో తెలియక తనలో తానే కుమిలిపోయింది. తాజాగా ఆ బాలిక గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. చేవెళ్ల పోలీసులు నిందితుడిని రిమాండుకు తరలించి, కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేయగా రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. మైనర్ బాలికల పట్ల తల్లిదండ్రులు కాస్త అప్రమత్తంగా ఉండాలని.. బయటకు పంపించే క్రమంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు పోలీసులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.