వారిద్దరు ప్రేమించుకున్నారు.. చెట్లపొదల్లోకి వెళ్లారు.. కొద్దిసేపటికి యువకుడు మాత్రమే బయటకు వచ్చాడు.. అక్కడ ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

Lovers: వారిద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకుంటానని ఆ ప్రేమికుడు చెప్పాడు. కానీ ఓ రోజు చెట్ల పొదల్లోకి వెళ్లిన వీరిద్దరు కొద్ది సమయం తర్వాత ఒక్కడే బయటకు వచ్చాడు. ఆమె మాత్రం అతడితో ఆ పొదల్లో నుంచి రాలేదు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  ఓ బాలిక ఇంటర్ పరీక్ష రాయడానికి వెళ్లినప్పుడు ఓ యువకుడు పరిచయం అయ్యాడు. పరిచయం కాస్త.. స్నేహంగా.. తర్వాత ప్రేమగా మారింది. ప్రేమిస్తున్నానని చెబితే ఆమె గుడ్డిగా నమ్మేసింది. అతడినే పెళ్లి చేసుకోవాలని ఆమె నిర్ణయించుకుంది. అతడు మాత్రం వక్రబుద్దితో ఉన్నాడు. ఆమెను లైంగికంగా దగ్గరకు చేసుకొని వదిలించుకోవాలనే ఆలోచనతో ఉన్నాడు. ఇద్దరు శారీరకంగా ఒక్కటయ్యాడు. అయితే ఓ రోజు ఆ బాలిక తనను పెళ్లి చేసుకోవాలి అన్నందుకు అతడు కోపంతో ఊగిపోయి ఆమె మెడకు ఉన్న చున్నీతో ఉరి వేసి చంపేశాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని అల్వాల్ లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు సీఐ గంగాధర్ ఇలా తెలిపారు. అల్వాల్ లో నిరుపేద దంపతులకు కుమార్తె (17), కుమారుడు ఉన్నారు. ఆ బాలిక డిగ్రీ చదువుతోంది. ఇంటర్ చదువుతున్న సమయంలో అల్వాల్ లోని ఓ పరీక్షా కేంద్రంలో బాలికకు దీపక్ (20) అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఇంటర్ పరీక్షలు రాస్తున్న సమయంలోనే ఒకరినొకరు ఇష్టపడ్డారు.

  పరీక్షలు నిర్వహిస్తున్నన్ని రోజులు వారిద్దరి మధ్య స్నేహం సాగింది. తర్వాత దీపక్ ఓ రోజు ఆమెకు ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పాడు. లైంగికంగా ఆమెను వశపరుచుకున్నాడు. ఇక ఆమెను వదిలించుకోవాలని అనుకున్నాడు. దానిలో భాగంగానే ఆమె ఫోన్ నంబర్ ను బ్లాక్ లో పెట్టేశాడు. దీంతో ఆమె ఓ రోజు డైరెక్ట్ గా కలిసి గట్టిగా నిలదీసింది. బీహెచ్‌ఈఎల్‌ క్వార్టర్స్‌ రైల్వే ట్రాక్‌ సమీపంలో కలుద్దామని చెప్పింది. అదే రోజు దీపక్‌ అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరూ సమీపంలోని చెట్ల పొదల్లోకి వెళ్లారు. అక్కడ ఆమె తనను పెళ్లి చేసుకోవాలని నిలదీసింది. ఈ విషయంలో అతడు ససేమిరా అన్నాడు. ఎంతకూ ఓప్పుకోలేదు. ఇద్దరి మధ్య వాగ్వాదం నడిచింది. కోపంతో ఊగిపోయిన దీపక్‌.. బాలిక గొంతును ఆమె ధరించిన చున్నితోనే బిగించి హత్య చేశాడు.

  మృతదేహాన్ని పొదల్లో పడేసి వెళ్లిపోయాడు. అర్థరాత్రి అయినా కుమార్తె ఇంకా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు. చుట్టుపక్కల వెతికారు. అయినా కనిపించలేదు. దీంతో అల్వాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వెళ్లి మృతదేహాన్ని గుర్తించారు. బాలిక తల్లి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేశారు. అతడిని పోలీసులు పట్టుకొని ప్రశ్నించారు. తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసినందుకే చంపేసినట్లు అతడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. తదనంతరం అతడిని రిమాండ్ కు తరలించారు.
  Published by:Veera Babu
  First published: