హైదరాబాద్(Hyderabad)లో మరోసారి భారీగా హవాలా మనీ పట్టుబడింది. సంపన్నులు ఉండే బంజారాహిల్స్(Banjara Hills)పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్డు నెంబర్ 12లో కారులో తరలిస్తున్న రెండు కోట్ల రూపాయల(2Crore rupees)ను అధికారులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో నిఘా పెట్టిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు(West Zone Task Force Police), బంజారా హిల్స్ పోలీసులు సంయుక్తంగా ఈ హవాలా మనీ ముఠాను పట్టుకున్నారు. పట్టుబడిన రెండు కోట్ల నగదును సీజ్ చేశారు. నగదు, కారును బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. కేవలం వారం రోజుల వ్యవధిలో హైదరాబాద్‌లో పట్టుబడిన హవాలా మనీ 9.3కోట్లకు చేరుకుంది.
వారం రోజుల్లో పది కోట్లు సీజ్ ..
హైదరాబాద్‌లో భారీగా హవాలా మనీ పట్టుబడింది. మంగళవారం గాంధీనగర్(Gandhinagar)లో 3.5కోట్ల హవాలా మనీని పట్టుకున్నారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు(Task Force Police). దీంతో గడిచిన మూడ్రోజుల వ్యవధిలోనే సుమారు ఏడు కోట్ల రూపాయలకుపైగా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అయితే మునుగోడు(Munugodu) ఉపఎన్నికల నేపధ్యంలో వరుసగా పెద్ద మొత్తంలో నగదు పట్టుబడటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. నగరంతో పాటు జిల్లా బోర్డర్‌లలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఎవరి నుంచి ఎవరికి ఇంత పెద్ద మొత్తంలో నగదు చేతులు మారుతోందనే కోణంలో ఆరా తీస్తున్నారు.
మూడున్నర కోట్ల హవాల మనీ ..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో హవాలా మనీ కట్టలు కట్టలుగా పట్టుబడుతోంది. గాంధీనగర్‌లో రెండు స్విఫ్ట్ కార్లలో సైదాబాద్‌కు నోట్ల కట్టల్ని తరలిస్తున్నట్లుగా సమాచారం అందుతున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు వాహనాల్ని తనిఖీ చేశారు. రెండు స్విఫ్ట్ కార్లలో 3.5కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బును సైదాబాద్‌లో ఉంటున్న బాలరాజుగౌడ్ అనే వ్యక్తికి అప్పగించాలని కొందరు వ్యక్తులకు డీల్ కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. హవాలా మనీతో ఉన్న కార్లను గాంధీనగర్‌లో పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ అధికారులు..నగదుతో పాటు రెండు కార్లను సీజ్ చేశారు. కార్లలో నగదు తరలిస్తూ పట్టుబడిన ఆరుగురిని పోలీసులకు అప్పగించారు.
ఎవరూ బాలరాజుగౌడ్..
సైదాబాద్‌కు చెందిన బాలరాజు గౌడ్ ఎవరూ..? అతనికి ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు పంపిన వ్యక్తి ఎవరూ అనే విషయంపై గాంధీ నగర్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ డబ్బును ఎందుకోసం తీసుకొచ్చారు. బాలరాజు గౌడ్ అనే వ్యక్తి ద్వారా ఇంకా ఎవరికైనా ఈ డబ్బులు చేరాల్సి ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మునుగోడు ఓటర్లకు పంపిణి చేయడానికి ఈ డబ్బులు తీసుకెళ్తున్నారనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.
నోట్ల కట్టల ప్రవాహం ..
మునుగోడు ఉపఎన్నికల నేపధ్యంలోనే ఇంత పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు చేతులు మారుతున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కేవలం మూడ్రోజుల వ్యవధిలోనే 7.3కోట్ల రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మునుపెన్నడు లేనంతగా పెద్ద మొత్తంలో హవాలా మనీ పట్టుబడటంతో అధికారులు వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టారు.
ఎక్కడి నుంచి వస్తోందీ హవాలా మనీ..?
మునుగోడు బైపోల్ కోసం ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి మూడు ప్రధాన రాజకీయ పార్టీలు. మరోవైపు స్థానిక ఓటర్లను ప్రలోభపెడుతున్నారని టీఆర్ఎస్ నాయకుల ఫోటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంటే ..కాదు బీజేపీ అభ్యర్ధి కాంట్రాక్టుల కోసమే పార్టీ మారారంటూ కాంట్రాక్ట్‌పే అంటూ పోస్టర్లు అంటించడంతో ఉపఎన్నిక ఉత్కంఠగా మారుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Telangana crime news