(Bala Krishna, News 18)
ఈ ఏడాది ఎండలు దంచి కొడతాయనుకున్న వారు కాస్త ఊరట చెందారు.. వేసవి ప్రారంభంలో ఎండలను చూసి భయపడ్డ జనం మే లో ఎలా ఎండలు ఎలా ఉంటాయో అని కంగారు పడ్డారు. అయితే గత పదేళ్లలో ఇంత తక్కువ ప్రభావం చూపించిన వేసవి (Summer) లేదని వాతావరణ శాఖ నిపుణులు (Meteorological experts) అంటున్నారు .ఈ సంవత్సరం వేసవి సీజన్‌కు సంబంధించిన వాతావరణ డేటా (Weather data) ను విడుదల చేసింది వాతావరణ శాఖ. ఈ ఏడాది వేసవి ప్రభావం చూపించకుండానే వెళ్లిపోయిందని చెబుతున్నారు నిపుణులు. గత పదేళ్లలో హైదరాబాద్ (Hyderabad)లో ఇదే చల్లని వేసవి అంటున్నారు. వాతావరణ శాఖ వాతావరణ శాఖ (IMD) ప్రకారం, 2019లో హైదరాబాద్‌లో అత్యధిక ఉష్ణోగ్రత 42.7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. దానితో పోలిస్తే, మార్చిలో ఉష్ణోగ్రతలు , ఏప్రిల్, మేలో 38 నుండి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య చాలా తక్కువగా నమోదయ్యాయి. అమెరికన్ సంస్థ అక్యూవెదర్ ప్రకారం, మార్చి 2022లో హైదరాబాద్‌లో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత మార్చి 31న 41 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఏప్రిల్ 2022లో, అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత ఏప్రిల్ 30న 42 డిగ్రీల సెల్సియస్, మే 2022లో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్ మే 1న నమోదైంది.
వాతావరణంలో వచ్చిన మార్పులు కారణం..
వాతావరణ నిపుణుడు రజనీకాంత్ న్యూస్ 18తో మాట్లాడుతూ.. “ఈ ఏడాది వేసవి తీవ్రత తక్కువగా ఉంది, ఈసారి రాష్ట్రంలో విస్తృతంగా వేడిగాలులు వీస్తాయని అంచవేశాం కాని అనూహ్యంగా వేడిగాలులు ఎక్కడ కూడా వీయలేదు. వాతావరణంలో వచ్చిన మార్పులు కారణం కావోచ్చని భావిస్తున్నాం. సాధారణంగా వేసవి నెలలలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. అవి మన తీరం ప్రాంతాల నుండి దూరంగా వెళ్లి దేశంలోని ఉత్తర, వాయువ్య ప్రాంతాల నుండి తెలంగాణకు గాలులు వీస్తాయి. ఈ ప్రాంతాల నుండి గాలులు పొడిగా ఉంటాయి, వేడి గాలులు ఫలితంగా వేడిగాలులు రాష్ట్రంలో ఏర్పడతాయి. అయితే, ఈ సంవత్సరం అల్పపీడన ప్రాంతాలు దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లి ఉత్తర వాయువ్య ప్రాంతాల నుండి పొడి గాలులను అడ్డుకున్నాయి, దీంతో ఉష్ణోగ్రతలు పెరగకుండా ఉండోచ్చనే అంచనా వేస్తున్నాం.” అని తెలిపారు.
తెలంగాణ, ఏపీ ప్రాంతాల్లోకి తేమ ఎక్కువగా రావడానికి కూడా ఇదే కారణమని ఆయన పేర్కొన్నారు. అయితే, ఉత్తర తెలంగాణలో మాత్రం మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా వేడిగాలులు వీస్తున్నాయని ఆయన తెలిపారు. మరో వైపు రుతుపవనాలు రాష్ట్రంలోకి ఎంట్రీ ఇవ్వడంతో వేడవి కి మనం ఇక గుడ్ బై చెప్పాల్సిందే అంటున్నారు నిపుణులు.. అనూహ్యంగా ఈ సారి భానుడు తన ప్రతాపం చూపించకుండానే వెళ్లిపోవడంతో అందరు ఊపిరి పీల్చుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: High temperature, Hyderabad, Summer