తెలంగాణలో ఇవాళ వర్షాలు పడ్డాయి. నగర వాసులకు మండుతున్న ఎండల నుంచి కాస్త ఉపశమనం లభించనుంది. ఎందుకంటే, గురువారం, శుక్రవారాల్లో హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. మార్చి 20 తేదీ వరకు కూడా నగరంలో వర్షం కురుస్తుందని తెలిపింది. అంతేగాక, మార్చి 16, 17 తేదీల్లో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వర్షంతో.. నగర వాసులకు మండుతున్న ఎండల నుంచి కాస్త ఉపశమనం లభించనుంది. ఎందుకంటే, గురువారం, శుక్రవారాల్లో హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.
మార్చి 20 తేదీ వరకు కూడా నగరంలో వర్షం కురుస్తుందని తెలిపింది. అంతేగాక, మార్చి 16, 17 తేదీల్లో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌లోని ఆరు జోన్లు హైదరాబాద్-ఛార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్బీనగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లిలో మేఘావృతమై వాతావరణం చల్లగా ఉండనుంది. హైదరాబాద్ నగర పరిధిలో గురువారం సాయంత్రం లేదా రాత్రి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 36 డిగ్రీల కంటే తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఈ వర్షాలతో నగర ప్రజలకు ఎండవేడిమి నుంచి కాస్త ఉపశమనం లభంచనుంది. సంగారెడ్డి పట్టణంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
Hailstorms now in #Vikarabad Telangana ! pic.twitter.com/GzS89WdeqH
— Vizag Weatherman (@VizagWeather247) March 16, 2023
తెలంగాణలో పలు చోట్లలో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే వికారాబాద్ జిల్లాలోని మార్పల్లిలో వడగండ్ల వాన భారీ ఎత్తున కురిసింది. దీంతో ఆ ప్రాంతం అంతా మంచు ప్రదేశం వలె మారిపోయింది. దీంతో అక్కడి ప్రజలు ఆ వాతావరణాన్ని మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను కొంత మంది తమ సెల్ ఫోన్లో చిత్రీకరించారు. కాగా ఈ వడగండ్ల వర్షానికి సంబంధించిన వీడియో కొద్ది సేపటికే రాష్ట్రం మొత్తం వైరల్ గా మారింది. పలువురు వడగండ్ల వానకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
మార్చి 15, 16, 17, 18 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయని వెల్లడించారు అధికారులు. ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. పగటి పూట ఎండ, సాయంత్రానికి వర్షాలు పడతాయని వివరించారు అధికారులు. ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడనున్నాయన్నారు. 16న ఉత్తర, పశ్చిమ, మధ్య దక్షిణ జిల్లాల్లో వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని.. 17 18 తేదీల్లో ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad Rains, Local News, Telangana rains