తెలంగాణలో పలు చోట్లలో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే వికారాబాద్ జిల్లాలోని మార్పల్లిలో వడగండ్ల వాన భారీ ఎత్తున కురిసింది. దీంతో ఆ ప్రాంతం అంతా మంచు ప్రదేశం వలె మారిపోయింది.దీంతో ప్రజలు ఆ వాతావరణాన్ని మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను కొంత మంది తమ సెల్ ఫోన్లో చిత్రీకరించారు.
మరోవైపు హైదరాబాద్‌ను కూడా వర్షం ముంచెత్తింది.పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. చార్మినార్ ప్రాంతంలో కూడా వర్షానికి షాపులు, దుకాణదారులు పలు ఇబ్బందులు పడ్డారు.ఆరాంఘర్ కూడలి వద్ద నలువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రేమావతి పేట, శివరాంపల్లి చౌరస్తా, కాటేదాన్ రైల్వే బ్రిడ్జి ప్రాంతాల్లో వరదనీరు నిలవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.
హైదరాబాద్‌లోను పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వర్షాలతో నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కొన్ని చోట్ల ఆకాశంలో మెరుపులు.. ఉరుములతో జనం భయానికి గురైయ్యారు. నగరంలోని గచ్చిబౌలి, యూసుఫ్‌గూడ, సోమాజీగూడ, అమీర్‌పేట, కూకట్‌పల్లి, పంజాగుట్ట, ఖైరతాబాద్, కాటేదాన్, రాజేంద్రనగర్, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు కురవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Local News, Rains