మేడ్చల్ జిల్లాలో కాల్పల కలకలం రేపాయి. మూడుచింతపల్లి మండలం ఉద్దెమర్రి గ్రామంలో సోమవారం అర్ధరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. మద్యం దుకాణం వద్ద కొందరు గుర్తు తెలియని దుండగులు గాల్లోకి కాల్పులు జరిగి హల్‌చల్ చేశారు. దాదాపు మూడు రౌండ్ల పాటు ఫైరింగ్ చేసి నానా బీభత్సం చేశారు. అనంతరం తుపాకులతో బెదిరించి మద్యం దుకాణంలో రూ.2 లక్షలు చోరీ చేశారు. ఆ తర్వాత అక్కడినుంచి పారిపోయారు.
ఈ ఘటనకు సంబంధించి స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం దుండగుల కోసం గాలిస్తున్నారు. కాల్పులకు పాల్పడింది ఎవరు అని కోణంలో ఆరా తీస్తున్నారు. మద్యం దుకాణం టార్గెట్‌గా దుండగులు ముందుగానే రెక్కీ నిర్వహించి... చోరీకి పాల్పడ్డారా ? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నేర చరిత్ర ఉన్న వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దొంగల్ని వీలైనంత త్వరలోపట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Local News