HOME »NEWS »TELANGANA »hyderabad govt teacher loss rs 5 lakh 54 thousand for fake amazon lucky lottery full details here hsn

రెండు నెలల్లో చెల్లి పెళ్లి.. అమెజాన్ నుంచి లక్కీలాటరీ అంటూ ఫోన్.. 60వేల టీవీ కోసం ఆ ప్రభుత్వోద్యోగి ఎన్ని లక్షలు కట్టాడంటే..

రెండు నెలల్లో చెల్లి పెళ్లి.. అమెజాన్ నుంచి లక్కీలాటరీ అంటూ ఫోన్.. 60వేల టీవీ కోసం ఆ ప్రభుత్వోద్యోగి ఎన్ని లక్షలు కట్టాడంటే..
ప్రతీకాత్మక చిత్రం

అమెజాన్ లో లక్కీలాటరీ తగిలిందంటూ ఓ ప్రభుత్వ ఉద్యోగికి సైబర్ చోరులు ఫోన్ చేశారు. రూ.60వేలు విలువ చేసే స్మార్ట్ టీవీ అమెజాన్ లక్కీలాటరీలో తగిలిందంటూ నమ్మించారు. ఈ క్రమంలో అతడికి మాయమాటలు చెప్పి నమ్మించి..

  • Share this:
    సైబర్ నేరగాళ్లు రూటు మార్చుతున్నారు. మనుషుల ఆశనే ఆయుధంగా చేసుకుంటున్నారు. లక్షలు విలువ చేసే వస్తువు ఫ్రీగా వస్తోందని నమ్మించి అమాయకుల ఖాతాలను కొల్లగొడుతున్నారు. పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, అప్రమత్తంగా ఉండండంటూ హెచ్చరిస్తున్నా నిరక్ష్యరాస్యులే కాదు, ఏకంగా ఉన్నతోద్యోగులే మోసపోతున్నారు. తాజాగా హైదరాబాద్ లో అచ్చం అలాంటి ఘటనే ఒకటి జరిగింది. అమెజాన్ లో లక్కీలాటరీ తగిలిందంటూ ఓ ప్రభుత్వ ఉద్యోగికి సైబర్ చోరులు ఫోన్ చేశారు. రూ.60వేలు విలువ చేసే స్మార్ట్ టీవీ అమెజాన్ లక్కీలాటరీలో తగిలిందంటూ నమ్మించారు. ఈ క్రమంలో అతడికి మాయమాటలు చెప్పి నమ్మించి అతడి నుంచి ఏకంగా 5 లక్షల 54వేల రూపాయలను కొల్లగొట్టారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    హైదరాబాద్ లోని ముషీరాబాద్ కు చెందిన శ్రీనివాస్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. వచ్చే వేసవి కాలంలో తన చెల్లెలు పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 12వ తారీఖున శ్రీనివాస్ కు ఓ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ’నేను అమెజాన్ నుంచి ఫోన్ చేస్తున్నాను. మీకు లక్కీ లాటరీ తగిలింది. 43 అంగుళాల సోనీ ప్లాస్మా టీవీని మీరు గెలుచుకున్నారు. నేను మీ మొబైల్ నెంబర్ కు ఓ లింక్ పెడతాను. ఆ లింక్ ను ఓపెన్ చేసి మీ వ్యక్తిగత వివరాలను పూర్తి చేయండి. రిజిస్ట్రేషన్ ఫీజు కింద మీరు ఐదు వేల రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది‘ అని శ్రీనివాస్ కు ఆ వ్యక్తి చెప్పాడు.


    ఇది కూడా చదవండి: అయ్యో పాపం.. జీవితాంతం సంపాదించిన సొమ్మంతా ఒక్క ఫోన్ కాల్ తో మటాష్.. ఏకంగా రూ.77 లక్షలు..

    దాదాపు 60 వేల రూపాయల విలువ చేసే ప్లాస్మా టీవీ కేవలం 5వేలకే వస్తోందని నమ్మిన శ్రీనివాస్ ఆ లింక్ ను ఓపెన్ చేసి తన వివరాలను నింపాడు. ఆ తర్వాత లింక్ పూర్తి చేస్తున్న క్రమంలో ట్రాన్స్ పోర్ట్ ఫీజు, జీఎస్టీ, రోడ్ ట్యాక్స్, ముంబయి నుంచి హైదరాబాద్ డెలివరీకి కస్టమ్స్ చార్జీలు అంటూ ఏకంగా 5 లక్షల 54 వేల రూపాయలు చెల్లించాడు. అతడు డబ్బు చెల్లిస్తున్న ప్రతీసారి అవతలి వ్యక్తికి ఫోన్ చేస్తే ’మీరు చెల్లించిన మొత్తం సొమ్ము మీకు టీవీ అందగానే రీఫండ్ అవుతుంది. కేవలం అయిదు వేల రూపాయలు మాత్రమే మీ నుంచి అమెజాన్ తీసుకుంటుంది. మిగిలిన సొమ్మునంత మీకు తిరిగి చెల్లిస్తుంది‘ అని నమ్మబలికాడు.
    ఇది కూడా చదవండి: 500 సార్లు వీర్యదానం చేసిన తండ్రి.. అమ్మాయిల జోలికి వెళ్లేందుకే భయపడిపోతున్న కొడుకు.. అసలు కథేంటంటే..

    అయితే రూ.5.54 లక్షలు చెల్లించిన తర్వాత త్వరలోనే మీకు టీవీ వస్తుందని అవతలి వ్యక్తి చెప్పాడు. అయితే తనకు ఎంతకూ టీవీ డెలివరీ రాకపోవడంతో తనకు వచ్చిన ఫోన్ నెంబర్ కు తిరిగి ఫోన్ చేశాడు. అయితే ఆ ఫోన్ స్విచాఫ్ లో ఉండటంతో తాను మోసపోయినట్టు గ్రహించాడు. దీంతో సోమవారం సైబరాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఈ విషయమై ఫిర్యాదు చేశాడు. ’నా చెల్లి పెళ్లి కోసం కూడబెట్టుకున్న సొమ్మునంతా దోచుకున్నారు. నాకు న్యాయం చేయండి.‘ అంటూ అతడు పోలీసులను విన్నవించుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన సైబరాబాద్ పోలీసులు విచారణ చేపట్టారు.
    ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో చార్టెడ్ అకౌంటెంట్.. రూ.3000 కోసం ట్రై చేస్తే.. ఏకంగా రూ.6,00,000 పోగొట్టుకున్నాడు.. అసలేం జరిగిందంటే..
    Published by:Hasaan Kandula
    First published:February 23, 2021, 15:16 IST