Ganesh Chaturthi: ఖైరతాబాద్‌ గణేశుని వద్ద భారీగా భక్త జనం.. తొలి పూజలో పాల్గొన్న గవర్నర్..

తెలంగాణ గవర్నర్

Ganesh Chaturthi: ఖైరతాబాద్‌ గణేశునికి గవర్నర్‌ తమిళసై తొలిపూజ నిర్వహించారు. తొలిపూజ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ మరియు హర్యానా గవర్నర్‌ దత్తాత్రేయ పాల్గొన్నారు. శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతిగా ఖైరతాబాద్‌ మహా గణపతి భక్తులకు దర్శనమిస్తున్నారు.

  • Share this:
    తెలుగు రాష్ట్రాల్లో వినాయకచవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గణేశుడికి గజమాల సమర్పించారు. ఉదయం 11.30 గంటలకు తొలిపూజలు అందుకున్నారు. కొవిడ్‌ నిబంధనల మేరకు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని ప్రఖ్యాత ఖైరతాబాద్‌ గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈసారి అక్కడ 40 అడుగులతో 'పంచముఖ రుద్ర మహాగణపతి'ని ప్రతిష్ఠించారు. మహాగణపతికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ తొలి పూజ నిర్వహించారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారీగా భక్తులు తరలి వస్తుండటంతో ఖైరతాబాద్‌ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది.

    పూజలో పాల్గన్న గవర్నర్



    Ganesh Chaturthi: వినాయక నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు.. పూర్తి వివరాలివే..


    40 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద కుడి వైపు కృష్ణకాళి అమ్మవారు, ఎడమవైపు కాల నాగేశ్వరి అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి. మహాగణపతి 36 అడుగులు ఎత్తు ఉండగా, తలపై ఉన్న సర్పంతో కలుపుకొని 40 అడుగుల ఎత్తు ఉంటుంది. ఖైరతాబాద్‌ మార్గంలో ఈ నెల 19 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఈ మార్గంలో భక్తులకు మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు.
    Published by:Veera Babu
    First published: