• Home
 • »
 • News
 • »
 • telangana
 • »
 • HYDERABAD GOVERNMENT TELLING ON CORONA CASES 66 PERCENT FALSE CALCULATIONS IN TELANGANA VB

Corona effect: కరోనా లెక్క తప్పుతోంది.. 66 శాతం కేసులను తక్కువ చేసి చూపుతున్న అధికారులు.. అసలేం జరుగుతోంది..

ప్రతీకాత్మక చిత్రం

Corona effect: కరోనా కేసులపై రాష్ట్ర సర్కారు తప్పుడు లెక్కలు చెబుతోంది. ప్రతిరోజూ సగానికి పైగా కేసులను తక్కువ చేసి చూపిస్తోంది. వందల్లో కేసులు నమోదవుతుంటే పదుల్లో.. వేలల్లో కేసులు నమోదవుతున్న టైంలో వందల్లో లెక్క చెబుతూ జనాలను తప్పుదోవ పట్టిస్తోంది. మరణాల లెక్కలను కూడా తక్కువ చేసి చూపిస్తున్నట్లు ‘ద న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ చేసిన సర్వే ఆధారంగా తెలిసింది.

 • Share this:
  తెలంగాణలో ఏప్రిల్ 17 వ తారీఖున 13 జిల్లాల్లో డీఎంహెచ్‌‌వోలు అధికారికంగా వెల్లడిస్తున్న లెక్కలకు.. సర్కారు బులెటిన్‌‌లో చెబుతున్న లెక్కలకు ఎంతో తేడా ఉంటోంది. 66 శాతం తగ్గించి రోజూవారి బులెటిన్ లో చూపినట్లు తెలుస్తోంది. 13 జిల్లాల్లో, ఏప్రిల్ 17 న నమోదైన జిల్లాల వారీగా డీఎంహెచ్ ఓ లు ఇచ్చిన డేటా ఆధారంగా మొత్తం కోవిడ్ -19 కేసుల సంఖ్య 4,868 గా ఉంది. అదే జిల్లాలో మీడియా బులెటిన్లో నివేదించిన కేసుల సంఖ్యను పరిశీలిస్తే 1,627 గా చూపించారు. అంటే 3,241 కేసులను తక్కువగా చేసి చూపించారు. కామారెడ్డి జిల్లాల్లో ఏప్రిల్ 17 న 915 మందికి పాజిటివ్ వచ్చినట్టు జిల్లా అధికారులు ప్రకటిస్తే హైదరాబాద్​లో రిలీజ్​ చేసే బులెటిన్‌‌లో 232 కేసులను సర్కారు చూపించింది. సంగారెడ్డి జిల్లాలో 700 మందికి కరోనా సోకితే 232 కేసులే వచ్చాయని చూపించింది. ఇలా ఖమ్మంలోనూ 525కు బదులు 155, మంచిర్యాల జిల్లాలోనూ 522 కు బదులు 124 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. అయితే మరణాల విషయంలోనూ ఇదే పరిస్థితి ఉంది. ప్రైవేట్ హాస్పిటళ్లలో, జిల్లాల్లోని కరోనా మరణాలేవీ బులెటిన్‌లో చూపించడం లేదు.

  పైగా బులెటిన్‌లో చూపిస్తున్న కరోనా ఇన్‌పేషెంట్ల లెక్కలన్నీ ఉత్తుత్తివేనని, దవాఖాన్లలో ఉన్న పేషెంట్ల సంఖ్యకు బులెటిన్‌లో చూపిస్తున్న లెక్కకు పొంతనే ఉండట్లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ జిల్లా స్థాయి అధికారులు కోవిడ్ -19 కేసుల డేటాను రోజువారీ మీడియాకు విడుదల చేసేవారు. అయితే, గత రెండు రోజుల నుండి వారు విడుదల చేయడం లేదు. ఎందుకని విడుదల చేయడం లేదని అధికారులను సంప్రదించగా.. ఆన్ లైన్ లో డేటాను సమర్పించాలని కలెక్టర్లు ఆదేశాలు జారీ చేసినట్లు వైద్య అధికారులు సూచించారన్నారు. అందుకే విడుదల చేయడం లేదని వారు సమాధానమిచ్చారు. కోవిడ్ -19 డేటా పట్ల తెలంగాణ ప్రభుత్వం చూపెడుతున్న కేసుల వివరాలకు తేడా ఎక్కువగా ఉండటంతో రెండు రోజుల నుంచి కోవిడ్ -19 కేసుల వివరాలను జిల్లా స్థాయి డేటాను ఇవ్వవద్దని ఆదేశిస్తూ ప్రభుత్వం అన్ని జిల్లాల్లోని ఆరోగ్య శాఖ అధికారులకు ఆర్డర్ జారీ చేసింది.

  ఇలా బులెటిన్ లో చూపించిన కేసుల వివరాలకు , జిల్లా స్తాయిలో అధికారులు వెల్లడించిన కేసుల వివరాలకు తేడాలు ఉండటం ఇది మొదటిసారి కాదు. గత సంవత్సరం కూడా కోవిడ్ 19 కేసులు, మరణాలను కూడా తక్కువ చేసి చూపిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. గణాంకాలలో తేడా ఉంటుందని గతంలో తెలంగాణ హైకోర్డు ప్రభుత్వాన్ని హెచ్చిరించిన విషయం తెలిసిందే. అయినా వ్యత్యాసం మాత్రం కనపడుతూనే ఉంది.
  Published by:Veera Babu
  First published: