గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్( MLA Rajasingh)కి బెయిల్
(Bail)మంజూరైంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను మంగళ్‌హట్(Mangalhat)కి చెందిన వ్యక్తి ఫిర్యాదు మేరకు రాజాసింగ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అటుపై నాంపల్లి(Nampally Court) కోర్టులో ప్రవేశపెట్టారు. 14వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రాజాసింగ్‌కు 14రోజుల రిమాండ్ విధించింది. అయితే ఆ తర్వాత రాజాసింగ్ తరపు లాయర్ బెయిల్ పిటిషన్ (Bail Petition)దాఖలు చేశారు. ఎమ్మెల్యే బెయిల్ పిటిషన్‌పై కోర్టులో వాదనలు జరిగాయి. అయితే సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం 41సీఆర్‌పీసీ(CRPC) పాటించకుండా ఎలా రిమాండ్ చేస్తారని న్యాయవాది కోరారు. పోలీసుల తరపు న్యాయవాది పాత కేసులను పరిగణలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టు కోరడం జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు చేసింది. కేసు దర్యాప్తులో పోలీసు అధికారులకు సహాకరించాలని ఆదేశించింది.
బెయిల్ మంజూరు ..
మహ్మద్ ప్రవక్తపై రాజా సింగ్ అనుచిత వ్యాఖ్యలు, వాటిపై ముస్లింల ఆందోళనలు, ఆ తర్వాత రాజా సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం, రాజా సింగ్ అనుచరుల నిరసనలతో... మంగళవారం హైదరాబాద్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా రాజా సింగ్‌ను నాంపల్లి కోర్టుకు తీసుకువచ్చిన సందర్భంగానూ ఆయన వ్యతిరేక, అనుకూల వర్గాలు పరస్పరం వాగ్వాదానికి దిగాయి. దీంతో కోర్టు వద్ద కూడా ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి చేజారిపోతోందని గ్రహించిన పోలీసులు లాఠీ చార్జీ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు.
ఎంఐఎం శ్రేణులు, ముస్లింలు ఆందోళన..
మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. మహ్మద్ ప్రవక్తను కించపరుస్తూ రాజాసింగ్ వీడియో విడుదల చేసిన తర్వాత గత రాత్రి హైదరాబాద్‌లో నిరసనలు చెలరేగాయి. బషీర్‌బాగ్‌లోని నగర కమిషనర్ సీవీ ఆనంద్ కార్యాలయం ఎదుట ఆందోళనకారులు నిరసనకు దిగారు. నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ నిరసనలు వెల్లువెత్తాయి. రాజాసింగ్ తమ మనోభావాలను కించపరిచారని, ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. వారిని అరెస్ట్ చేసిన పోలీసులు పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు.
BJP MLA #RajaSingh was booked under sec 153a, 295, 505 IPC for making derogatory comments against Prophet. Protests were held against the lawmakers demanding his arrest. Singh had threatened to disrupt the show of comic #MunawarFaruqi for hurting Hindu sentiment.#Hyderabad pic.twitter.com/BdiMukSjFh
— Ashish (@KP_Aashish) August 23, 2022
వీడియోతో వివాదం షురూ ..
కమెడియన్ మునావర్ ఫరూకీ హైదరాబాద్‌లో షో నిర్వహిస్తే తాను కూడా ఓ ‘కామెడీ’ వీడియోను విడుదల చేస్తానని రాజాసింగ్ గతంలోనే హెచ్చరించారు. ఆయన షో నిర్వహించకుండా అడ్డుకోవాలని, లేదంటే వేదికను తగలబెడతానని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో మునావర్ ఫరూకీ షో రోజున పోలీసులు రాజాసింగ్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మునావర్ ఫరూకీ షో నిర్వహించాడు. దీంతో ముందు చెప్పినట్టుగానే రాజాసింగ్ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో రాజాసింగ్ మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా మాట్లాడారంటూ నిరసనలు వెల్లువెత్తాయి. వీడియో వివాదానికి దారి తీయడంతో పోలీసులు డిలీట్ చేశారు. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Raja Singh, Telangana News