హోమ్ /వార్తలు /తెలంగాణ /

వైరల్ గా మారిన జైల్లో అల్పాహారం చేస్తున్న రాజాసింగ్ వీడియో.. క్లారిటీ ఇచ్చిన అధికారులు..

వైరల్ గా మారిన జైల్లో అల్పాహారం చేస్తున్న రాజాసింగ్ వీడియో.. క్లారిటీ ఇచ్చిన అధికారులు..

ఎమ్మెల్యే  రాజాసింగ్

ఎమ్మెల్యే రాజాసింగ్

Hyderabad:  చర్లపల్లి జైల్లో రాజాసింగ్ టిఫిన్ చేస్తున్న వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. దీనిపై జైలు సిబ్బంది క్లారిటీ ఇచ్చారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

గోషా మహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై (MLA Raja Singh) పీడీ చట్టం కింద పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఒక వర్గాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని, ఆయన పట్ల అనేక ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. అదే విధంగా ఆయన వ్యాఖ్యల పట్ల శాంతి భద్రతలకు విఘాతం కల్గే అవకాశం ఉండటంతో పోలీసులు ఆయనపై పలు కేసులను నమోదు చేశారు. అదే విధంగా.. అనేక మంది వివిధ పోలీసు స్టేషన్ లలో రాజాసింగ్ కు వ్యతిరేంగా అనేక కేసులను నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను పోలీసులు కోర్టులో ప్రవేష పెట్టారు.


ఆ తర్వాత.. కోర్టు ఆదేశాల మేరకు ఆయనను హైదరాబాద్ లోని (Hyderabad)  చర్లపల్లిలో జైలుకు తరలించారు. అయితే.. తాజాగా, ఆయనకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ గా (viral video) మారింది. ఎమ్మెల్యే రాజాసింగ్ ఒక బల్లపై కూర్చోని టిఫిన్ చేస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఆయనకు బయటనుంచి ప్రత్యేకంగా టిఫిన్ లు, డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ ఉండటందానిలో కన్పిస్తుంది. అయితే.. దీనిపై చర్లపల్లి జైలు అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఆ వీడియో జైలుపరిధిలోనికి కాదని అధికారులు తెలిపారు.రాజాసింగ్ కు జైలులోని, సామాన్య ఖైదీల మాదిరిగానే ట్రీట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, రాజాసింగ్ కు నిన్న ఉదయం పులిహోర, మధ్యాహ్నం చపాతీ, సాయంత్రం చికెన్ అందించినట్లు జైలు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.


ఇదిలా ఉండగా క్లాస్ లో బాలిక పట్ల టీచర్ అమానుషంగా ప్రవర్తించింది.


మిజోరాంలోని (Mizoram)  లుంగ్లీ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోనికి వచ్చింది. తంగ్ పుయ్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో.. ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థిని యూనిఫామ్ అను అదే పాఠశాలకు చెందిన టీచర్ విప్పించింది. కేంద్రం యొక్క సర్వశిక్షా అభియాన్ కింద రిక్రూట్ చేయబడిన లాల్బియాకెంగిగా గుర్తించబడిన కాంట్రాక్టు మహిళా టీచర్ ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. బాలికను, తోటి విద్యార్థి గాయపర్చాడు. దీంతో ఆమెను కొన్నిరోజుల పాటు ఇంట్లోనే ఉంచుకున్నారు. ఆ తర్వాత... మరోసారి స్కూల్ కు పంపించగా, అతను దాడిచేశాడు. దీంతో బాలిక తల్లి, స్కూల్ కు వచ్చి, ఆ బాలుడిని తిట్టింది.


దీంతో స్కూల్ టీచర్.. కోపంతో బాలిక తల్లికి కాల్ చేసింది. ఇలా చేయడం సరికాదని చెప్పింది. ఈ క్రమంలో కోపంతో బాలిక తల్లి.. పాఠశాలకు వచ్చింది. తన కూతురుని ఇంటికి తీసుకెళ్తానని చెప్పింది. అయితే.. స్కూల్ యూనిఫామ్ తీసేసి.. బాలికను ఇంటికి తీసుకెళ్లిపోవచ్చని టీచర్ తెగేసి చెప్పింది. దీంతో వేరమార్గం లేక బాలిక దుస్తులు తీసేసి, కేవలం లోదుస్తుల మీదనే ఆమె తను కూతురుని ఇంటికి తీసుకెళ్లింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది.


Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Raja Singh, Telangana News, VIRAL NEWS

ఉత్తమ కథలు