తెలంగాణ(Telangana)రాష్ట్రం అభివృద్ధిలోనే కాదు అవకాశాల కల్పనలో కూడా అగ్రగామిగా మారుతోంది. దేశంలోని మరే రాష్ట్రంలో జరగనంత అభివృద్ది, ఉపాధి అకాశాలు, ఉద్యోగాల కల్పన, ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్, ప్రైవేట్ సెక్టార్‌లో జాబ్స్ తెలంగాణలో గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈక్రమంలోనే హైదరాబాద్ (Hyderabad)మెట్రోపాలిటన్ సిటీ కాస్తా గ్లోబల్ సిటీ(Global City)గా మారింది. అందుకే ఇప్పుడు హైదరాబాద్ మరో అరుదైన అవకాశం దక్కించుకుంది. దిగ్గజ ఐటీ కంపెనీలకు నెలవైన భాగ్యనగరంలో గూగుల్(Google)అతి పెద్ద కార్యాలయం ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. నానాక్‌రాంగూడ(Nanakkaranguda)లోని 7.3 ఎకరాల్లో 30లక్షల 30వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గూగుల్ పర్మినెంట్ క్యాంపస్ ఏర్పాటు చేస్తోంది. దీనికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం గురువారం జరిగింది. తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్(KTR) దీనికి శంకుస్థాపన (Lays foundation stone)చేశారు. ప్రపంచంలోనే గూగుల్ ఏర్పాటు చేస్తున్న రెండో అతిపెద్ద కార్యాలయం ఇదే కావడం విశేషంగా చెప్పుకోవాలి. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఇప్పటికే అమెజాన్, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి అగ్రగామి సంస్థలతో పాటు గూగుల్ కూడా తన పర్మినెంట్ ఆఫీస్‌ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు రావడం గర్వకారణమన్నారు మంత్రి కేటీఆర్.
అందరి చూపు హైదరాబాద్‌పైనే..
ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ దిగ్గజ కంపెనీలకు హైదరాబాద్ నగరం శాశ్వత కూడలి అవుతోందన్నారు. అనేకచోట్ల తాత్కాలిక, అద్దె భవనాల్లోనే కొనసాగే ఈ కంపెనీలు.. హైదరాబాద్‌లో మాత్రం సువిశాలమైన సొంత క్యాంపస్‌లు నిర్మించుకోవడం ఒకరకంగా ఇక్కడి ప్రజలకు, యువతకు కలిసొచ్చే అంశంగా అభివర్ణించారు. గూగుల్‌తో రాష్ట్ర సర్కారుఅవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఐటీ ఆటోమేషన్, యూఎక్స్ డిజైన్, డాటా అనలిటిక్స్,ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ రంగాల్లో యువతకు శిక్షణతో పాటు వీ-హబ్‌తో కలిసి మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, సూక్ష్మ, చిన్న పరిశ్రమల వ్యవస్థాపకులకు ఆర్థిక నైపుణ శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగపడనుంది. అలాగే ప్రభుత్వ పాఠశాలలు డిజిటల్ విద్యలో సాధికారతకు సహకారం అందుతుంది. ఈ-లెర్నింగ్‌పై విద్యార్థులు, విద్యావేత్తలకు శిక్షణ దొరుకుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. డిజిటల్ తెలంగాణకు ఇదొక బలమని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్.
టెక్ దిగ్గజం గూగుల్ అమెరికాలోని మౌంటెన్ వ్యూలో ఉన్న తమ ప్రధాన కార్యాలయం తర్వాత రెండవ అతిపెద్ద క్యాంపస్ 3.3 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్ లో నిర్మించతలపెట్టింది. ఈ క్యాంపస్ కు ఐటి మంత్రి @KTRTRS నేడు శంకుస్థాపన చేశారు pic.twitter.com/pkoBnq2xeh
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) April 28, 2022
ఐటీ అభివృద్ధిలో పరుగులు..
గూగుల్ 2017 నుంచి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది. డిజిటల్ తెలంగాణ ఆలోచనకు మద్దతు ఇవ్వడంతోపాటు డిజిటల్ రంగంలో పౌరులు సాధికారత సాధించాలనే పరస్పర లక్ష్యాన్ని సాధించడానికి గూగుల్ తోడ్పాటు అందిస్తున్నదని పేర్కొన్నారు. వరల్డ్‌లోనే అతిపెద్ద ఐటీ కంపెనీగా ఎదిగిన గూగుల్ భారత్‌లో గూగుల్ కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి హైదరాబాద్‌ను కేంద్రంగా మార్చుకుంది. ఇకపై కూడా తమ కార్యకలాపాలను తెలంగాణలో మరింత విస్తరింజేస్తామని గూగుల్ ఇండియా కంట్రీ హెడ్, ఉపాధ్యక్షుడు సంజయ్ గుప్తా తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Google, Hyderabad, Minister ktr