Home /News /telangana /

HYDERABAD GOOD NEWS TO SCHOOL STUDENTS PARENT WHO HAD BURDEN TO PAY SCHOOL FEES THEY USE FEE PAD APP NGS BK

School Fees: పేరెంట్స్ కు గుడ్ న్యూస్.. ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా..? వాయిదాల్లో ఫీజులు చెల్లించే అవకాశం? ఎలా అంటే?

ఫీ ప్యాడ్ యాప్

ఫీ ప్యాడ్ యాప్

School Fees: విద్యార్థుల తల్లిదండ్రులకు గుడ్ న్యూస్.. పిల్లల ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా..? అయితే వాయిదాల ప‌ద్ద‌తుల్లో పే చేసే అవ‌కాశం క‌ల్పిస్తోన్నారు హైద‌రాబాద్ యువ‌కులు.. త‌ల్లిదండ్రుల‌కు, విద్యాసంస్థ‌ల‌కు వీళ్ల స్టార్ట ప్ ఎంతో హెల్ప్ అవుతోంది.

ఇంకా చదవండి ...
  M BalaKrishna, Hyderabad, News18.

  School Fees: విద్యార్థుల తల్లిదండ్రుల (Parents) కు శుభవార్త..  ఈ రోజుల్లో సాధారణంగా  చ‌దువుల‌కు చాలా ఖర్చు చేయాల్సి వస్తోంది.  ఎల్ కేజీ నుంచి ప‌దో త‌రగ‌తి వ‌ర‌కు చ‌దువుల‌కు ల‌క్ష‌ల్లో ఖ‌ర్చు చేయాల్సిన (School Fees) పరిస్థితి. చిన్న చిన్న ప్రైవేటు స్కూళ్లు (Private Schools) సైతం ముక్కు పిండి ఫీజులు వసూళ్లు చేస్తున్నాయి. అయితే  ఈ ల‌క్ష‌ల్లో ఉన్న ఫీజులు ఒక్క సారి క‌ట్టాలేక చాలా మంది మధ్యతరగతి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  అలాంటి వారి కోసం ఈ యువ‌కులు ఒక వినూత్న ఆలోచ‌న‌తో ముందుకొచ్చారు.  ఇప్పుడున్న ప‌రిస్థితిల్లో పిల్ల‌ల ఫీజులు చేల్లించే విష‌యంలో త‌ల్లిదండ్రులు ప‌డుతున్న ఇబ్బందుల‌ను అర్ధం చేసుకోని దానికి ఒక ప‌రిష్కారాన్ని చూపించాల‌నే ఉద్దేశంలో ఒక వినూత్న ఆలోచ‌న‌తో ముందుకొచ్చారు.

  అప్ప‌టికే ఓలా కంపెనీలో ఉన్న‌త ఉద్యోగం చేస్తోన్న భ‌ర‌త్, త‌న ఇద్ద‌రి స్నేహితులు స‌తిష్, వినోద్ స‌హాకారంతో త‌న‌కు వ‌చ్చిన ఆలోచ‌న‌కు కార్య‌రూపం ఇచ్చారు. ఈ ముగ్గురు అలా మొద‌లు పెట్టిన స్టార్ట్ పే ఫీ ఫ్యాడ్ ఇప్పుడు ఎందరికో యూజ్ ఫుల్ గా ఉంది.  త‌ల్లిదండ్ర‌లు స‌మ‌స్య‌ల‌ను  ప‌రిష్క‌రించ‌డ‌మే కాకుండా విధ్యాసంస్థ‌ల రోజువారి నిర్వ‌హించే కార్య‌క‌లాపాల‌ను కూడా మ‌రింత సుల‌భ‌త‌రం చేస్తోంది. విద్యాసంస్థ‌ల‌కు విద్యార్ధ‌లు చేల్లించాల్సిన ఫీజుల కోసం కొన్ని బ్యాంక్ ల‌తో టైప్ పెట్టుకొని బ్యాంక్ ల ద్వారా ఫీజులు చెల్లించి త‌రువాత బ్యాంక్ ల‌కు త‌ల్లిదండ్రులు సుల‌భ వాయిదాల ప‌ద్ద‌తుల్లో ఆ డ‌బ్బును చెల్లించే వెసులబాటు వీళ్లు క‌ల్పిస్తోన్నారు.

  ఇదీ చదవండి : డైలామాలో జ‌గ‌న్? కేబినేట్ విస్త‌ర‌ణ మూహుర్తం డేట్ పై భిన్నఅభిప్రాయాలు? ఎటూ తేల్చుకోలేక‌పోతున్న జ‌గ‌న్

  అలాగే విద్యార్ధి చ‌దువు సంబంధించి ట్రాక్ చేసుకునే వెసులు బాటు కూడా వీళ్లు రూపోందించిన యాప్ లో ఉంటుంది.  విద్యాసంస్థ‌లు విద్యార్ధ‌లు మేనేజ్మెంట్ ఫీజ్ మెనేజ్మెంట్, ఇత‌ర రోజువారి కార్య‌కాల‌పాలు వీళ్లు రూపోందించి ఫీ ప్యాడ్ సాప్ట్ వేర్ ద్వార సుల‌భంగా చేసుకోవ‌చ్చు. అయితే వీళ్లు రూపోంచింది ఈ సాప్ట్ వేర్ ఉచితంగా విద్యాసంస్థ‌ల‌కు అందించ‌డం ఇక్క‌డ చెప్పుకోదగ్గ అంశం. ఇప్ప‌టికే కొన్ని విధ్యాసంస్థ‌లు త‌మ రోజువారి కార్య‌కాల‌పాల కోసం త‌మ కోసం కొన్ని ప్ర‌త్యేక‌మైన సాప్ట్ వేర్ లేదా యాప్ లు రూపోందించుకుంటాయి ఇందుకోసం భారీగా ఖ‌ర్చు చేస్తాయి. ఏడాది ఒక సారి లేదా ఒకే సారి పెద్ద మొత్తంలో ఈ సాప్ట్ వేర్ ల‌కు డ‌బ్బు చేల్లించాల్సి ఉంటుంది అయితే ఈ కుర్రాలు చేసి సాప్ట్ వేర్ ను అన్ని విద్యాసంస్థ‌ల‌కు ఫ్రీగా అందిస్తున్నారు.  

  ఇదీ చదవండి : ప్రధాని సహా, కేంద్రమంత్రులతో సీఎం జగన్ వరుస భేటీలు.. ఆయన ఏం చెప్పారంటే..?

  దీంతోపాటు ఇందులో త‌ల్లిదండ్రుల‌కు పీజులు వాయిదాల ప‌ద్ద‌తిలో క‌ట్టుకునే వెసులుబాటు కూడా క‌ల్పిస్తోన్నారు.  వీళ్లు రూపోందించిన FeePad కు ఇప్ప‌టి వ‌ర‌కు 1,30,000 కంటే ఎక్కువ క్రియాశీల వినియోగదారులతో 100 కంటే ఎక్కువ విద్యాసంస్థ‌లు ప‌లు బ్యాంక్ ల నెట్ వ‌ర్క్ తో ఆంధ్ర, తెలంగాణ తమిళనాడులో ప్రాంతాల్లో త‌మ సేవాల‌ను అందిస్తోంది. FeePad ను దాదాపు 3 సంవత్సరాల క్రితం జూన్ 2020లో పీక్ సమయంలో తన 2 సహ వ్యవస్థాపకులు సతీష్ వంగల, వినోద్ బోయిన్‌పల్లితో పాటు సంస్థ వ్యవస్థాపకుడు CEO అయిన భరత్  కృష్ణన్ స్థాపించారు.

  ఇదీ చదవండి : టీడీపీ యువ ఎంపీతో ప్రధాని ముచ్చట్లు.. కూతురుకి చాక్లెట్లు ఇచ్చిన మోదీ సర్ ప్రైజ్

  ఈ యువ‌కుల ఐడియాకు ఫిదా అయిన  హైదరాబాద్‌కు చెందిన బొండాడ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ 340 కోట్ల టర్నోవర్ కంపెనీ ఈ యువ‌కుల‌కు ఆర్ధికంగా అండ‌గా ఉండ‌టానికి ముందుకొచ్చింది. అలా దాదాపు 3 ఏళ్ల క్రితం కోటి రూపాయిల పెట్టుబ‌డితో ప్రారంభించి ఈ సంస్థ‌కు ప్ర‌స్తుతం విద్యాసంస్థ‌ల నుంచి త‌ల్లిదండ్ర‌లు నుంచి మంచి గుర్తింపు వ‌స్తోంది. “అత్యంత మారుమూల ప్రాంతాల‌కు కూడా సంకేతికత‌ను అందించ‌డం త‌ల్లిదండ్రులు పిల్ల‌ల ఫీజులు చెల్లించ‌డానికి ప‌డే ఇబ్బందుల‌కు ప‌రిష్కారం చూపించ‌డంతోపాటు విద్యాసంస్థ‌లు త‌మ రోజువారి కార్య‌కాలాపాల‌కు ఒక చ‌క్క‌టి ప‌రిష్కారం చూపిండం  కోసం పుట్టిన ఆలోచ‌నే ఈ ఫీ ప్యాడ్.

  ఇదీ చదవండి : విశాఖలో భూముల కబ్జా ఆరోపణలకు కారణం ఆయనే..? మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

  మంచి ఉద్దేశంతోనే తాము ఈసంస్థ‌ను స్థాపించామంటున్నారు యువకులు. ముఖ్యంగా  ఒక ఫోన్ కొంటేనే ఫైనాన్స్ చేసే బ్యాంక్లు ఇత‌ర ఫైనాన్స్ సంస్థ‌లు ఒక వ్య‌క్తి త‌న జీవితంలో ఉన్న స్థానానికి వెళ్ల‌డానికి పునాదైన చ‌దువుకు ఎందుకు పైనాన్స్ చేయ్య‌వు అనే ఆలోచ‌న తమకు వచ్చిందని..  ఈ స‌మ‌స్య‌  ప‌రిష్కారాని క‌నుగోవ‌డానికి ఉప‌యోగ‌ప‌డింది అన్నారు. ప్ర‌స్తుతం తమ  సంస్థ టాప్ పైనాన్స్ కంపెనీల‌తో టైప్ పెట్టుకొని విద్యార్ధ‌లు త‌ల్లిదండ్ర‌లు త‌మ పిల్ల‌ల పీజులు సుల‌భ వాయిదాల ప‌ద్ద‌తుల్లో చెల్లించే వెసులుబాటు క‌ల్పిస్తోంద‌ని” న్యూస్ 18 కి తెలిపారు భరత్ ఎస్ కృష్ణన్ వ్యవస్థాపకుడు, CEO.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Hyderbad, School fees, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు