హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్.. వాట్సాప్ లోనే టికెట్ బుకింగ్.. ప్రాసెస్ ఇదే!

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్.. వాట్సాప్ లోనే టికెట్ బుకింగ్.. ప్రాసెస్ ఇదే!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Hyderabad Metro Rail : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు అదిరిపోయే వార్త. ఇక, మీరు మీ టికెట్ ను వాట్సాప్ నుంచి బుక్ చేసుకోవచ్చు. ఎలా బుక్ చేసుకోవాలో ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకుందాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

హైదరాబాద్ (Hyderabad) మెట్రో రైలు (Metro)కు పూర్వ వైభవం వచ్చేసింది. కరోనాతో నష్టాల ఊబిలో చిక్కుకుపోయిన మెట్రో మళ్లీ ప్రయాణీకులతో కిక్కిరిసిపోతోంది. నగరంలో ఇతర ఉద్యోగుల కంటే ఐటీ ఉద్యోగులే (IT Employees) మెట్రోలో ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. ప్రస్తుతం ఐటీ కంపెనీల్లో 35 శాతం వరకు ఉద్యోగులు ఆఫీసులకు వచ్చిన పనిచేస్తున్నారు. కొద్దినెలల క్రితం ఇది కేవలం 10 శాతం మాత్రమే ఉండేది. ఐటీ ఉద్యోగులు మళ్లీ ఆఫీసులకు వెళ్తుండటంతో మెట్రోకు ఆదరణ క్రమంగా పెరుగుతోంది. దీంతో.. హైదరబాద్ మెట్రో కూడా అదిరిపోయే సేవల్ని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువస్తుంది.దేశంలోనే మొట్ట మొదటిసారిగా వాట్సాప్‌ (Whatsapp) ద్వారా మెట్రో ప్రయాణానికి సంబంధించిన టికెట్‌ను బుకింగ్‌ చేసుకునే సేవలను తాజాగా ప్రారంభించింది. సోమవారం ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రో రైలు సీఈఓ, ఎండీ కెవీబీ రెడ్డి లాంచనంగా ప్రారంభించారు.

ఎల్అండ్‌టీ హైదరాబాద్ మెట్రో రైల్ తన డెలివరీ భాగస్వామి బిల్ఈజీ (Billeasy) తో కలిసి వాట్సాప్ ద్వారా ఈ-టికెటింగ్ సిస్టమ్‌ను ప్రారంభించిన మొదటి సంస్థగా నిలిచింది. బిల్ఈజీ భారతదేశపు అత్యంత విజయవంతమైన ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్. గత కొన్ని నెలలుగా అనేక ట్రయల్స్ తర్వాత, హైదరాబాద్ మెట్రో రైల్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ కోసం బిల్లేసి మరియు ఏఎఫ్‌సీ (ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్) భాగస్వామి, షెల్‌ఇన్ఫో గ్లోబల్‌ఎస్‌సీ సింగపూర్‌తో కలిసి వాట్సప్‌ ద్వారా డిజిటల్ టిక్కెట్ బుకింగ్ కొత్త మోడ్‌ను ప్రారంభించింది.

ఈ సరికొత్త సర్వీస్ హైదరాబాద్ మెట్రో రైల్‌లో నిత్యం ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రయాణీకులు ఇప్పుడు తమ సొంత వాట్సాప్ నంబర్‌లో ఈ-టికెట్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇది ప్రయాణంలో కొనసాగడానికి ఏఎఫ్‌సీ గేట్ల వద్ద ఏర్పాటు చేస్తారు. అయితే.. ఈ టిక్కెట్‌ను TSavaariతో పాటు ఇతర థర్డ్‌ పార్టీ యూపీఐ చెల్లింపుల ద్వారా బుక్‌ చేసుకోవచ్చు.

ఈ సందర్బంగా కేవీబీ రెడ్డి మాట్లాడుతూ.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మెట్రో ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సేవలను అందించేందుకు కృషి చేస్తున్నామ‌ని తెలిపారు. ఇందులో భాగంగానే వాట్సాప్‌ టికెటింగ్‌ సదుపాయాన్ని ప్రారంభించామని,ఇలాంటి సేవలను ప్రారంభించడం దేశంలో తొలి మెట్రో రైలు సంస్థగా రికార్డు నెలకొల్పామ‌ని చెప్పారు. బిల్‌ ఈజీ సంస్థ భాగస్వామ్యంతో వాట్సాప్‌ ద్వారా మెట్రో ప్రయాణికులు టిక్కెట్లను బుకింగ్‌ చేసుకునేలా సేవలను ప్రారంభించామని తెలిపారు.

ఇది కూడా చదవండి : 13వ అంతస్తు లేకుండానే భవనాల నిర్మాణం.. జనాల భయమే కారణమా ?

వాట్సాప్ ద్వారా టికెట్ బుకింగ్ ఇలా..

-మెట్రో ప్రయాణికులు మొదట 8341146468 నంబకు వాట్సాప్‌ ద్వారా హాయ్‌ అనే మెసేజ్ ను పంపించాలి. దానికి వెంటనే మరో మెసేజ్ తో ఒక లింకు వస్తుంది. లింకును ఒపెన్‌ చేయగానే (https://hyd.billeasy.in) వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది.

-ఆ త‌ర్వాత‌ ప్రయాణం చేసే మార్గాన్ని చూపిస్తుంది. అందులో ఏ మెట్రో స్టేషన్‌ నుంచి ప్రయాణం ప్రారంభించి, ఎక్కడ దిగుతారో నమోదు చేయాలి.

- ఆ తర్వాత టిక్కెట్‌ ఒకరి కోసమా, తిరుగు ప్రయాణమా అని అడుగుతుంది. వీటిని ఎంపిక చేసుకున్న తర్వాత టిక్కెట్‌ కోసం చెల్లించాల్సిన రుసుమును చూపిస్తూ ప్రోసీడ్‌ బటన్‌ బ్లూ కలర్‌ చూపిస్తుంది.

- దాన్ని నొక్కగానే పే నౌ బటన్‌ వస్తుంది. అక్కడి నుంచి యుపీఐ, లేదా ఇతర అకౌంట్ల ద్వారా టిక్కెట్‌ కోసం చెల్లింపులు చేయవచ్చు.

– టిక్కెట్‌ కోసం నిర్ణీత చెల్లింపు చేసిన తర్వాత క్యూర్‌ కోడ్‌తో టికెట్‌ వస్తుంది. దాని మెట్రో స్టేషన్‌లో ఎంట్రీ గేటు వద్ద క్యూఆర్‌ కోడ్‌ రీడర్‌ ముందు చూపితే లోపలి వెళ్లేందుకు అనుమతిస్తుంది. ఈవిధంగా అరచేతిలోని స్మార్ట్‌ఫోన్‌ ద్వారా మెట్రో రైలు టిక్కెట్లను అత్యంత సులభంగా కొనుగోలు చేసి ప్రయాణం చేయవచ్చని తెలిపారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Hyderabad, Hyderabad Metro rail, Telangana News, Ticket, Whatsapp

ఉత్తమ కథలు