హోమ్ /వార్తలు /తెలంగాణ /

Gold robbery: హైదరాబాద్  శివారులో విచిత్ర దోపిడీ.. తాళాలు పగులకుండా బీరువాలో బంగారం మాయం.. ఇలా ఎలా ..

Gold robbery: హైదరాబాద్  శివారులో విచిత్ర దోపిడీ.. తాళాలు పగులకుండా బీరువాలో బంగారం మాయం.. ఇలా ఎలా ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Gold robbery: ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి. బీరువా తాళాలు కూడా ఇంటి యజమాని దగ్గరే ఉన్నాయి. 24 గంటలు ఆ ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు. అయినా బీరువాలో బంగారం మాత్రం చోరీకి గురయింది. ఈ వింత చోరీ కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

ఇంకా చదవండి ...

  ఇంట్లో దొంగతనం జరిగిందని పోలీసులకు సమాచారం రాగానే ఇంటిని పరిశీలిస్తారు. పరిశీలన క్రమంలో ఇళ్లంతా చిందరవందరగా.. బీరువాలో ఉన్న సామాన్లు కిందపడేసి.. వస్తువులను పగలకొట్టి నానా హంగామా చేసి దొంగలు వారి పని పూర్తి చేసుకొని వెళ్తారు. సాధారణంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని క్లూస్ టీం ఆధారంగా దర్యాప్తు ప్రారంభిస్తారు. కానీ ఓ కేసులో పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది. దొంగతనం ఎలా జరిగిందో కూడా తెలియట్లేదు. కానీ ఇంట్లో ఉన్న విలువైన బంగారం మాత్రం అపహరణకు గురైంది. ఎక్కడ ఉంచిన వస్తువులు అక్కడే ఉన్నాయి. అయితే కేసు నమోదు చేసుకున్నా.. ఎలా ముందుకు వెళ్లాలో అర్థం కాకుండా జుట్టు పట్టుకుంటున్నారు. ఈ కేసు చాలా విచిత్రంగా ఉందని.. కేసుకు సంబంధించి సాంకేతికంగా, టెక్నికల్‌గా పూర్తి వివరాలు సేకరించి కేసును ఛేదిస్తామని పోలీసులు తెలిపారు. ఈ వింత దొంగతనం హైదరాబాద్ శివారులోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కీసర సీఐ జె.నరేందర్‌ గౌడ్‌ కథనం ప్రకారం ఇలా ఉన్నాయి.

  హైదరాబాద్ శివారులోని దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్‌గూడ గ్రామంలో పల్లె రాములు గౌడ్‌ అతని భార్య పల్లె సునీత, కుమారుడు మణికంఠ, కోడలు తేజస్వి ఒకే ఇంట్లో నివాసముంటారు. ఇటీవల పల్లె రాములు గౌడ్ భార్య సునీత తన బంధువులకు సంబంధించి ఓ ఫంక్షన్ కు వెళ్లింది. మిగతా కుటుంబసభ్యులు ఇంట్లోనే ఉన్నారు. ఆమె ఊరి నుంచి తిరిగి వచ్చి ఇంట్లోని బీరువాలో ఉన్న బాక్సుల్లో కిలో బంగారం దాచి పెట్టింది. అవి ఆమె కు సబంధించిన బంగారు ఆభరణాలు. 18 తులాల మ్యాం గో నక్లెస్‌, ఏడు తులాల చౌకర్‌, ఎనిమిది తులాల వైట్‌స్టోన్‌ లాంగ్‌ నక్లెస్‌, 3 తులాల గాజులు, 4 తులాల రింగులు, 2 తులాల చెవి కమ్మలు, 12 తులాల లాంగ్‌ నక్లెస్‌, మూడు తులాల నక్లెస్‌, నాలుగు తులాల చెవి రింగులు, 7తులాల లాంగ్‌ నక్లెస్‌, 10 తులాల షెల్‌ నక్లెస్‌, 6 తులాల బ్లాక్‌ బెడ్‌ చైన్‌, 3 తులాల మూడు జతల కమ్మలు, రెండు తులాల గ్లీన్‌ చైన్‌, మూడు తులాల తెల్లరాళ్ల నక్లెస్‌, ఐదు తులాల బ్రాస్‌లెట్‌, ఐదు తులాల చైన్‌ లు దాచి పెట్టింది. ప్రతీ రోజు ఆమె వాటిని చెక్ చేస్తూ ఉండేది. అయితే రెండు రోజుల క్రితం ఎప్పటి లాగే ఆమె బీరువా తెరిచి తన బంగారాన్ని చూసింది. అక్కడ బాక్సులు ఉన్నాయి కానీ అందులో రూ.50 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు మాత్రం కనిపించలేదు. దీంతో ఆమెకు కాళ్లు, చేతులు ఆడలేదు. వెంటనే కుటుంబసభ్యులను అడిగింది. ఎవరైనా తీశారా అని.. కానీ వారు తీయలేదు అనగానే వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. వారు వచ్చి బీరువాలను పరిశీలించారు. తాళం, బీరువా పగలకుండా అందులో బంగారం అపహరణకు గురైందని బాధితురాలు పోలీసులకు చెప్పింది.

  24 గంటల పాటు ఇంట్లో ఎవరో ఒకరుంటారు. బీరువా తాళాలు ఇంట్లోనే ఉన్నాయి. బీరువాలోని బాక్సులూ ఉన్నాయి. కానీ, బాక్సుల్లోని బంగారం మాత్రం చోరీకి గురైంది. కీసర పోలీస్ స్టేషన్ సీఐ జె.నరేందర్‌ గౌడ్‌ కేసు నమోదు చేసుకున్నారు. బీరువా పగిలిపోకుండా, తాళాలు ఇంటి యజమాని వద్ద ఉన్నా బీరువా బాక్సుల్లో ఉన్న కిలో బంగారం మాయమైపోవడంతో ఈ కేసు చాలా విచిత్రంగా ఉందని కీసర సీఐ తెలిపారు. త్వరలోనే టెక్నికల్ గా ఈ కేసుకు సంబంధించిన వివరాలను, చోరీ చేసిన నిందితులను పట్టుకుంటామని సీఐ తెలిపారు.

  Published by:Veera Babu
  First published:

  Tags: Crime, Crime news, Gold robbery, Hyderabad, Keesara, Telangana crime

  ఉత్తమ కథలు