Home /News /telangana /

HYDERABAD GIRL WHO JUMPED FROM A BUILDING IN HYDERABAD BECAUSE SHE DIDNT WANT TO STUDY IN A NEW SCHOOL SNR

Student suicide : తండ్రిపై కోపంతో బిల్డింగ్‌ పైనుంచి దూకిన టెన్త్ విద్యార్ధిని .. అంతకు ముందు ఏం జరిగిందంటే

(STUDENT SUICIDE)

(STUDENT SUICIDE)

Hyderabad: టెన్త్ క్లాస్ చదువుతున్న బాలిక తల్లిదండ్రులపై అలిగింది. గిఫ్ట్‌లు, పాకెట్ మనీ ఇవ్వనందుకు కాదు..ఆమెకు నచ్చని స్కూల్‌లో చదువుకోవాలని చెప్పారని ఏం చేసిందో తెలుసా.

చదువుకునే పిల్లల్లో కొందరు గిఫ్ట్‌లు కొనివ్వలేదని తల్లిదండ్రులపై అలగడం చూశాం. పాకెట్ మనీ కోసం పేరెంట్స్‌ దగ్గర మారం చేసే వాళ్లు ఉంటారు. కాని హైదరాబాద్‌(Hyderabad)లో పదవ తరగతి చదువుతున్న బాలిక తల్లిదండ్రులు తనను స్కూల్ (School)మార్పించారనే కోపంతో బిల్డింగ్‌(Building)పైనుంచి దూకింది. స్థానికంగా ఈసంఘటన కలకలం రేపింది. పిల్లలకు నచ్చని పనులు చేస్తే ఇంతటి కఠిన నిర్ణయాలు తీసుకుంటారా అని స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

Mystery : తంగభద్రనదిలో 4ఏళ్ల పాప శవం..ఘాట్ దగ్గర తల్లి వస్తువులు ..అసలేం జరిగిందంటే



టెన్త్ స్టూడెంట్ సూసైడ్..
సికింద్రాబాద్ కాప్రాలో విషాద సంఘటన జరిగింది. కట్టమైసమ్మ గుడి దగ్గరలోని శ్రీహన్స్‌ వజ్రం అపార్టుమెంట్‌లో నివాసముంటున్న వాచ్‌మెన్ రవి కూతురు కావ్య ఉంటున్నారు. బిల్డింగ్‌ పైనుంచి దూకింది. తీవ్రంగా గాయపడిన కావ్యను ఆసుపత్రికి తరలించినప్పటికి ప్రయోజనం లేకపోయింది. తీవ్రంగా గాయలవడంతో మృతి చెందింది. మృతి చెందిన బాలిక కావ్య సైనిక్‌పురి గోకుల్‌నగర్‌లోని సిటీ హైస్కూల్‌లో టెన్త్ క్లాస్ చదువుతోంది. తొమ్మిదవ తరగతి సాకేత్‌లోని విద్యాభారతి స్కూల్‌ చదివింది. పదవ తరగతి కావడం, స్కూల్‌ ఇంటికి దూరంగా ఉండటంతో తండ్రి రవి స్కూల్‌ మార్పించాడు. అపార్టుమెంట్‌కు దగ్గరగా ఉంటుందని సిటీ హైస్కూల్‌లో చేర్పించారు.



నచ్చని స్కూల్‌లో చదవలేక..
కావ్యకు కొత్తగా చేరిన స్కూల్‌లో చదువుకోవడం ఇష్టం లేదు. అదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. తనను పాత పాఠశాలలోనే చేర్పించమని కోరింది. ఇందులో భాగంగానే సోమవారం కావ్య స్కూల్‌కు వెళ్లలేదు. తండ్రి స్కూల్‌కు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. కొత్త స్కూల్‌కి వెళ్లడం తనకు ఇష్టం లేదని మరోసారి గట్టిగా చెప్పడంతో తండ్రికి ఆగ్రహం వ్యక్తం చేశాడు. కూతుర్ని మందలించాడు. తల్లిదండ్రులు మందలించారనే మనస్తాపానికి గురై వెంటనే ఇంట్లోంచి వెళ్లిపోయింది.

Telangana : ఆ జిల్లాలో మెడికల్‌ షాపులకు భలే గిరాకీ .. జనం వాటికి అలవాటు పడటం వల్లేనంట..!



బతుకుదెరువు కోసం వచ్చి..
ఇంట్లోంచి ఆవేశంగా వెళ్లిన కూతురు కావ్య కోసం తల్లిదండ్రులు వెదుకుతుండగానే ఎదురుగా ఉన్న అపార్టుమెంట్‌ పైనుంచి కావ్య కిందపడటం చూసి షాక్ అయ్యారు. భవనంపై నుంచి కిందపడిన కావ్యకు తీవ్రంగా గాయపడటంతో వెంటనే తల్లిదండ్రులు హాస్పటల్‌కి తరలించారు. కావ్య తలకు బలమైన దెబ్బ తగలడంతో ట్రీట్‌మెంట్ అందిస్తుండానే ప్రాణాలు విడిచింది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా దోరదేవరపాడు గ్రామానికి చెందిన నాగళ్ల రవి, రాధ దంపతులు 17 ఏళ్ల క్రితం నగరానికి వచ్చారు. బతుకు దెరువు కోసం వచ్చిన దంపతులు బిడ్డను కోల్పోవడం స్థానికుల్ని తీవ్రంగా బాధించింది.
Published by:Siva Nanduri
First published:

Tags: Hyderabad news, Student, Suicide

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు