తెలంగాణ (Telangana)లో బీజేపీ వినూత్న రాజకీయ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. TRS ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ఇంకా మరో 529 రోజులే ఉన్నాయంటూ గంటలు, నిమిషాలు, సెకన్లను కౌంట్‌డౌన్‌గా చూపుతూ selavudora అనే ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఈ వెబ్సైట్లో (Selavudora.com) అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవల్సిందిగా బీజేపీ సూచించింది. ‘‘సాలు దొర–సెలవు దొర’... కల్వకుంట్ల కౌంట్‌డౌన్’ (Saaludora selavudora Kalvakunta countdown) అంటూ డిజిటల్ గడియారం Live Display నాంపల్లిలోని బీజేపీ ప్రధాన కార్యాలయం గేటు పక్కన ఏర్పాటు చేశారు. ఈ స్క్రీన్‌పై ‘సాలు దొర, సెలవు దొర’అనే నినాదాలతో సీఎం కేసీఆర్ ఫొటోలను ప్రదర్శిస్తున్నారు. దీనికి అనుగుణంగా సామాజిక మాధ్యమాల్లో సీఎం కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్‌ను విమర్శిస్తూ పెద్ద సంఖ్యలో ప్రచారానికి దిగింది. ఇక కార్యవర్గ సమావేశాలు, బహిరంగ సభ నిర్వహణ కోసం చేస్తున్న ఏర్పాట్లలో భాగంగా పెడుతున్న పోస్టర్లు, ఫ్లెక్సీలు, కటౌట్ల పైనా టీఆర్‌ఎస్ సర్కారును, కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ కామెంట్లు పెట్టింది.
రంగంలోకి జీహెచ్ఎంసీ..
అయితే బీజేపీ (BJP)కి షాక్ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది. రాష్ట్ర బీజేపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కౌంట్ డౌన్ డిజిటల్ బోర్డుకు జీహెచ్ ఎంసీ (GHMC) అధికారులు ఫైన్ (Fine) విధించారు. అనుమతులు తీసుకో కుండా డిస్ప్లే ఏర్పాటు చేయడంపై రూ.50వేల జరిమానా వేస్తున్నట్లు అధికా రులు వెల్లడించారు. జీవో 68 ప్రకారం ఫైన్ వేస్తున్నట్లు పేర్కొన్నారు. డిజిటల్ బోర్డు (Digital board) ఏర్పాటు చేసిన నాటి నుంచి దానిని తొలగించేందుకు పోలీసులు, జీహెచ్ఎంసి సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు పలు దఫాలుగా బీజేపీ నేతలను అధికారులు సంప్రదించినా ససేమిరా అనడంతో ఫైన్ వేసినట్లు. జీహెచ్ఎంసీ అధికార్డులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా కౌంట్ డౌన్ బోర్డును తాత్కాలికంగా నిలిపివేశారు. దీనిపై స్పందించిన బీజేపీ కార్యాలయ వర్గం' టెక్నికల్ సమస్యల కారణంగానే నిలిపివేసినట్లు వెల్లడించారు. బీజేపీ కార్యాలయం ఎదుట ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫొటోలతో ఏర్పాటు చేసిన బ్యానర్. కటౌట్‌కు సైతం అధికారులు రూ.5వేల జరిమానా విధించారు అధికారులు .
జిల్లాల్లో టీఆర్‌ఎస్ బ్యానర్లు..
మరోవైపు బీజేపీ ప్రచారాన్ని, విమర్శలను తిప్పికొట్టేలా టీఆర్‌ఎస్ నేతలు హైదరాబాద్‌లోని పలు కూడళ్లలో ‘సాలు మోదీ.. సంపకు మోదీ’అంటూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ‘బైబై మోదీ’అంటూ పెద్ద అక్షరాలతో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలపై.. ‘సాగు చట్టాలు తెచ్చి రైతులను చంపావు’, ‘నాలుగేళ్ల కాంట్రాక్టు ఉద్యోగాలతో యువత కడుపు కొట్టావు’, ‘లాక్‌డౌన్ పేరిట గరీబోళ్లను సంపావు’అనే నినాదాలను ముద్రించారు. నోట్ల రద్దు, రైతుచట్టాలు, నల్లధనం వెనక్కి రప్పించడం తదితర అంశాలను ప్రస్తావించారు. ‘ప్రజల ఖాతాల్లో వేస్తానన్న రూ.15 లక్షలు ఎక్కడ?’అని ప్రశ్నలు పెట్టారు. ఈ ఫ్లెక్సీలను ప్రస్తావిస్తూ ‘పరేడ్ గ్రౌండ్‌కు వస్తున్నవు కదా.. ఈ పోస్టర్లు ఏపియమంటవా మోదీజీ.. ఎనిమిదేళ్లలో మీ పథకాలు ఎంత మందిని చంపాయో కౌంట్ చేద్దామా తరుణ్ చుగ్గు..’అని ఎద్దేవా చేస్తూ టీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ ట్వీట్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Fine, GHMC, Hyderabad, Telangana bjp