mayor visit :ఎక్కడి చెత్త అక్కడే.. మేయర్ ఆకస్మిక తనిఖీ..అధికారుల తీరుపై ఆగ్రహం

అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మేయర్

mayor visit : జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి నగరంలో ఆకస్మిక పర్యటన చేశారు. స్పెషల్ డ్రైవ్ లో భాగంగా అధికారుల పనితీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Share this:
కరోనా ఉగ్రరూపం దాల్చుతుండడంతో రాష్ట్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా నగరంలో శానిటేషన్ పై మంత్రి కేటీఆర్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ ఉద్యోగులు ఎవరు సెలవులు పెట్టొద్దని ఆదేశాలు జారీ చేశారు. దీంతో నగరంలో శానిటేషన్ కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. దీంతో అధికారులు, ప్రజా ప్రతినిధులు రంగంలోకి దిగారు. కాని నగరంలో కొన్ని చోట్ల మాత్రం మంత్రి మాటలు పట్టించుకున్నట్లుగా కనిపిస్తోంది..నగరంలోని కొన్ని పలు ప్రాంతాల్లో ఎక్కడి చెత్త అక్కడే కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలోనే మంత్రి వర్యులు కే టీ ఆర్ గారి ఆదేశాల మేరకు నగరంలోని జరుగుతున్న స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ లో బాగంగా ఖైరాతాబాద్ , చార్మినార్ జోన్‌లలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆకస్మికంగా పరిశీలించారు.

అయితే ఖైరాతాబాద్ జోన్ లోని గుడిమల్కాపూర్ డివిజన్ సంతోష్ నగర్ కాలనీ లో చెత్తను చూసి షాక్ అయ్యారు. మెహదీపట్నం లోని విజయ నగర్ కాలనీ లోని రోడ్డు మీద ఒక కిలో మీటర్ మేరా చెత్త ఉండడం చూసి మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చెత్తను తీయించాలని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. ఖైరతబాద్ జోన్ లో చాలా చోట్ల చెత్త నిలవ ఉందని వెంటనే వాటి మొత్తాన్ని తీపించాలని కోరారు నగరం లో ఎక్కడ కోడా చెత్త నిల్వలు కనపడ వద్దని మేయర్ చెప్పారు. ఇలా నగరంలోని కొన్ని డివిజన్‌లలో మేయర్ ఆకస్మిక తనిఖీ చేయడంతో సిబ్బంది లోపాలను గమనించారు. దీంతో వెంటనే అధికారలకు ఆదేశాలు జారీ చేసి పేరుకుపోయిన చెత్తను తీసివేయించారు. ఇక ఉద్యోగుల బయోమెట్రిక్ వ్యవస్థను కూడ ఆమె పరీశీలించారు. హజరుకాని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
Published by:yveerash yveerash
First published: