హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: గ్రేటర్‌ వాసులకు జీహెచ్‌ఎంసీ వార్నింగ్ .. ఇప్పటి నుంచి అలా చేస్తే ఫైన్ కట్టాల్సిందే

Hyderabad: గ్రేటర్‌ వాసులకు జీహెచ్‌ఎంసీ వార్నింగ్ .. ఇప్పటి నుంచి అలా చేస్తే ఫైన్ కట్టాల్సిందే

(GHMC FILE PHOTO)

(GHMC FILE PHOTO)

GHMC | Hyderabad: జంటనగరాల పరిధిలో ఉండే ప్రజలకు జీహెచ్ఎంసీ అధికారులు ఫైన్‌ల మోత మోగిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త తరహా జరిమానాలు విధిస్తూ గ్రేటర్‌ వాసులకు చుక్కలు చూపిస్తున్నారు. సిటీలో ఇంటి ఆవరణ శుభ్రంగా ఉంచుకోని యజమానులకు జరిమానాలు విధిస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

జంటనగరాల పరిధిలో ఉండే ప్రజలకు జీహెచ్ఎంసీ(GHMC)అధికారులు ఫైన్‌ల మోత మోగిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త తరహా జరిమానాలు విధిస్తూ గ్రేటర్‌ వాసులకు చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా బల్దియాలో పెరుగుతున్న సీజన్‌ వ్యాధులు(Seasonal diseases), విషజ్వరాల(Toxic fevers)ను కట్టడి చేయడానికే బల్దియా అధికారులు ఈవిధంగా కొరడా ఝుళిపిస్తున్నారు. సిటీలోని ప్రతి ఇల్లు తిరిగి పరిశీలించాలని క్రింది స్థాయి సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటికే ఖైరతాబాద్(Khairatabad),రాజేంద్రనగర్‌(Rajendranagar)డివిజన్లలోని కొందరికి జరిమానాలు కూడా విధించారు.


Agent fraud : వరినాట్లు వేసేందుకు వచ్చిన కూలీలను వదలని బ్రోకర్ .. ఎలా మోసం చేశాడంటేనగరవాసులకు కొత్త ఫైన్లు ..
గ్రేటర్ హైదరాబాద్‌లో దోమల నివారణ, సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ఇళ్లు, ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోని వారికి ఫైన్‌ విధించాలని గ్రేటర్ అధికారులతో కమిషనర్‌ జరిపిన సమావేశంలో నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఎంటమాలజీ స్టూడెంట్స్‌ని నగరంలోని ప్రతి అపార్ట్‌మెంట్‌లు, ఇల్లు కాలనీల్లోని ప్రతి ఇంటిని పరిశీలించి పరిసరాలు శుభ్రంగా లేకపోతే ఇంటి యజమానులకు రెండు సార్లు వార్నింగ్ ఇవ్వాలని అప్పటికి దోమ లార్వా పెరగకపోతే శుభ్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోని యజమానులకే జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు బల్దియా అధికారులు.పరిసరాల శుభ్రతపై ఫోకస్ ..

తెలంగాణలో ఇప్పటికే మలేరియా, డెంగీ కేసులు పెరుగుతున్నాయి. వచ్చే నెలలో దోమలు మరింత పెరిగే అవకాశమున్నందున వాటి కారణంగానే ఈ తరహా యాక్షన్‌ తీసుకుంటున్నారు. ఖైరతాబాద్‌, రాజేంద్రనగర్‌ ఏరియాల్లో కొన్ని ఇళ్లకు ఫైన్‌లు వేశారు కాని వసూలు చేయలేదు. అయితే స్థానికంగా ఉంటున్న నాయకులు, కాలనీల ప్రెసిడెంట్ల సాయంతో ఫైన్లు వసూలు చేస్తామని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.అయితే రోడ్లు, కాలనీల్లో పేరుకుపోతున్న చెత్తను తొలగించకుండా తమకు ఫైన్లు విధించడం ఏమిటని నగరవాసులు బల్దియా అధికారులను ప్రశ్నిస్తున్నారు.


Crime news : బంధువుల ముందు భర్త ఇన్సల్ట్ చేశాడని తమ్ముళ్లతో కలిసి ఆమె అంత పని చేసిందివైరల్‌ వ్యాధులకు చెక్ పెట్టడానికే ..

మరోవైపు బల్దియా అధికారులు ప్రతి ఇంటిని, అపార్ట్‌మెంట్‌ పరిసరాల్లో పరిశుభ్రతను పరిశీలించాల్సిన బాధ్యతను ఎంటమాలజీ సిబ్బందికి అప్పగించారు. అయితే నగర జనాభాతో పోలిస్తే సిబ్బంది తక్కువ కారణంగా పని ఒత్తిడి పెరుగుతోందని జీహెచ్ఎంసీ కార్మికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 2300మంది ఉన్న సిబ్బందిని 75000మందికి పెంచపోతే ..ఎంటమాలజీ సిబ్బంది సైతం వైరల్ రోగాల బారినపడి మరింత ఒత్తిడి పెరుగుతుందంటున్నారు.

Published by:Siva Nanduri
First published:

Tags: GHMC, Telangana News

ఉత్తమ కథలు