హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad : మరో 12గంటల్లో భీకరమైన ఈదురు గాలులు వీచే అవకాశం .. నగరవాసులు ఇంట్లో ఉంటే మంచిది : GHMC

Hyderabad : మరో 12గంటల్లో భీకరమైన ఈదురు గాలులు వీచే అవకాశం .. నగరవాసులు ఇంట్లో ఉంటే మంచిది : GHMC

GHMC Warning

GHMC Warning

Hyderabad | Telangana: హైదరాబాద్‌ నగరవాసులను జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నారు. రాబోయే 12గంటల్లో నగరంలో బలమైన ఈదురు గాలులు వీస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో జగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చెట్ల కింద ఎవరూ ఉండవద్దని, వాహనదారులు జాగ్రత్తగా వ్యవహరించాలని..అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రావద్దని సూచిస్తున్నారు.

ఇంకా చదవండి ...

(M.Balakrishna,News18,Hyderabad)

రాగల 12గంటల్లో తెలంగాణ(Telangana)లో వాతావరణ మార్పు తీవ్రంగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరికల నేపధ్యంలో అటు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అప్రమత్తమైంది. ముఖ్యంగా హైదరాబాద్‌ (Hyderabad)నగరంలో బలమైన ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురుస్తుందని వెల్లడించింది. ఈదురు గాలుల కారణంగా భారీ వృక్షాలు విరిగిపడే అవకాశముందని కాబట్టి ఎవరూ చెట్ల కింద ఉండవద్దని నగరవాసులకు హెడ్‌ఎండీఏ(HMDA), జీహెచ్‌ఎంసీ(GHMC)అధికారులు సూచించారు. అలాగే వాహనదారులు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

నగరవాసులకు హెచ్చరిక..

వర్షాలు, ఈదులు గాలులు వీస్తాయన్న హెచ్చరికలతో జీహెచ్‌ఎంసీ ఇప్పటికే నగరంలోని లోతట్టు ప్రాంతాలతో పాటు చాలా చోట్ల ఎమర్జెన్సీ సర్వీసుల కోసం డీఆర్ఎఫ్‌ బృందాలను రంగంలోకి దింపింది. భారీగా గాలులు వీస్తాయనే హెచ్చరికల నేపధ్యంలో సంజీవయ్య పార్కులోని అతి పెద్ద జాతీయ జెండాను సైతం తాత్కాలికంగా దింపినట్లుగా హెచ్ఎండీ ఈవీడీఎం అర్వింద్‌కుమార్‌ తెలిపారు. జాతీయ జెండా ఎలాంటి డ్యామేజ్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేందుకే ఈవిధంగా చేసినట్లు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.

ఇల్లు కదలకపోతే మంచిది..

అంతే కాదు నగరంలో వీచే ఈదురు గాలుల ప్రభావంతో పలుచోట్ల విద్యుత్‌ అంతరాయం ఏర్పడే అవకాశం కూడా ఉండటంతో విద్యుత్‌శాఖ సిబ్బందిని అప్రమత్తం చేశారు హెచ్ఎండీఏ, జీహెచ్‌ఎంసీ అధికారులు. అత్యవసరం అయితే తప్ప నగరవాసులు ఎవరూ అనవసరంగా బయటకు రావద్దని హెచ్చరించారు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్.

OU Exams Postponed: ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల వాయిదాపై కీలక ప్రకటన.. వివరాలివే


చెట్ల కింద నిల్చుంటే ప్రమాదం..

హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్షముప్పు ఉందని హెచ్చరించారు అధికారులు. నగరంలో ఎక్కడైనా ఈదురుగాలులు సంభవించి విద్యుత్‌ తీగలు, స్తంబాలు, చెట్లు విరిగి రోడ్లపై పడితే సంప్రదించడానికి 040-29555500 నెంబర్‌కి కాల్ చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచిస్తున్నారు.

First published:

Tags: GHMC, Greater hyderabad, Hyderabad Heavy Rains, Weather report

ఉత్తమ కథలు