GHMC Elections 2020: ఓటెత్తని గ్రేటర్ పౌరులు.. మిగిలింది కేవలం ఐదు గంటలే

GHMC Elections 2020: పోలింగ్‌కు మరో ఐదు గంటలు మాత్రమే సమయం ఉంది. దీంతో నగరంలో ఓటింగ్ శాతం కనీసం 40 శాతమైనా దాటుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

news18-telugu
Updated: December 1, 2020, 1:49 PM IST
GHMC Elections 2020: ఓటెత్తని గ్రేటర్ పౌరులు.. మిగిలింది కేవలం ఐదు గంటలే
GHMC Elections: ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
జీహెచ్ఎంసీ ఓటర్లు మారలేదు. ఎప్పటిలాగే ఓటు వేయడానికి ఆసక్తి చూపడం లేదు. మధ్యాహ్నం 1 గంటలవరకు వరకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేవలం 18.20 శాతం పోలింగ్ మాత్రమే నమోదు కావడమే ఇందుకు ఉదాహరణ. పోలింగ్‌కు మరో ఐదు గంటలు మాత్రమే సమయం ఉంది. దీంతో నగరంలో ఓటింగ్ శాతం కనీసం 40 శాతమైనా దాటుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బస్తీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఓటు వేసేందుకు జనం ముందుకొస్తున్నా.. జూబ్లీ హిల్స్ వంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఓటు వేయడానికి జనం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైనప్పటికీ.. చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్య తక్కువగా కనిపించింది. ఉదయం 9 గంటల వరకు 3.10 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది.

అయితే పది గంటల తరువాత ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో వస్తారని రాజకీయ పార్టీలు, అధికారులు భావించారు. కానీ గ్రేటర్ ఓటర్లు మాత్రం ఎప్పటిలాగే ఓటు వేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదనే విషయం ఓటింగ్ శాతాన్ని బట్టి అర్థమవుతోంది. జూబ్లీ హిల్స్‌లోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల కోసం సిబ్బంది వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు ఎంతగా కోరినా.. ఓటర్లు మాత్రం వారిన విజ్ఞప్తిని పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. అయితే నగరంలో బస్తీలు ఎక్కువగా ఉండే పలు ప్రాంతాల్లో మాత్రం జనం ఓటు వేసేందుకు క్యూ కడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు శివారు ప్రాంతాల్లోనూ ఓటింగ్ పర్వాలేదనిపించేలా ఉందని తెలుస్తోంది.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం గతంలోనూ 50 శాతం కూడా నమోదు కాలేదు. 2009లో 42.04 శాతంగా నమోదైన ఓటింగ్.. 2016లో 45.29 శాతంగా నమోదైంది. ఈసారి ఓటింగ్ శాతం 50 శాతానికి చేరుకునేలా చేయాలని చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటూనే ఓటింగ్ శాతం పెరగడానికి ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. అయితే అధికారుల అంచనాలకు భిన్నంగా ఈసారి ఓటర్లు ఓటు వేసేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోవడం గమనార్హం.
Published by: Kishore Akkaladevi
First published: December 1, 2020, 1:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading