Home /News /telangana /

HYDERABAD GHMC ELECTIONS BANDI SANJAY ALLEGES TRS GOVERNMENT HAND OVER CASH DISTRIBUTION IN MEDCHAL OF TELANGANA NK

మేడ్చల్‌లో డబ్బుల పంపిణీ... అడ్డుకున్నందుకు పోలీసులు దాడి చేశారంటూ బండి సంజయ్ ఆగ్రహం

హరీష్ రెడ్డిని పరామర్శిస్తున్న బండి సంజయ్

హరీష్ రెడ్డిని పరామర్శిస్తున్న బండి సంజయ్

Hyderabad GHMC Elections 2020: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి తెరపడటంతో... ఇక ఇప్పుడు డబ్బులు, మద్యం పంపిణీ జోరందుకుంది.

    Hyderabad Elections 2020: తెలంగాణ పోలీసుల తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న రాత్రి మేడ్చల్‌లో డబ్బులు పంచుతుంటే... ఆ తంతును మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు హరీష్ రెడ్డి అడ్డుకున్నారనీ... ఐతే... పోలీసులు ఆయనపైనే దాడి చేశారని మండిపడ్డారు. దాడిలో గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హరీష్ రెడ్డిని బండి సంజయ్ అర్థరాత్రి 12 గంటలకు పరామర్శించారు. రాష్ట్ర డీజీపీ ముఖ్యమంత్రి డైరెక్షన్లో పనిచేస్తూ... టీఆర్ఎస్ పార్టీకి కొమ్ము కాస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజాభిమానం కోల్పోయిన TRS పార్టీ... అడ్డదారిలో గెలవాలని చూస్తోందని మండిపడ్డారు. పోలీస్ అధికారులే దగ్గరుండి డబ్బుల పంపిణీ చెయ్యడం సిగ్గుచేటన్న బండి సంజయ్... ఇలాంటి వాటిని బీజేపీ కార్యకర్తలు ఎక్కడికక్కడ అడ్డుకోవాలని పిలుపిచ్చారు.

    ఉన్నత స్థాయి నిఘా అధికారి TRS పార్టీని ఎలా గెలిపించాలా అని వ్యూహ రచన చేస్తూ చట్టాల్ని తుంగలో తొక్కారని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. అభివృద్ధే గెలిపిస్తుందని మేకపోతు గాంభీర్యం ప్రదర్షించి తీరా ఎన్నికలు దగ్గర పడ్డాక నోట్ల కట్టలతో బయల్దేరారని టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు. పోలీసులను TRS కార్యకర్తలుగా వాడుకుంటూ కేసీఆర్ ప్రభుత్వం రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతోందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలుపును అడ్డుకోలేరన్న సంజయ్... TRS నాయకులు రెడ్ హ్యాండెడ్‌గా డబ్బులు పంచుతూ పట్టుబడినా... కేసులు నమోదు చెయ్యకపోవడం దారుణమన్నారు.

    Hyderabad GHMC Elections 2020, ghmc elections, telangana election commission, political parties, GHMC Elections 2020, trs, bjp, mp aravind, తెలంగాణ జీహెచ్ఎంసీ ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు, తెలంగాణ వార్తలు, తెలుగు వార్తలు, తెలుగు న్యూస్,
    హరీష్ రెడ్డిని పరామర్శిస్తున్న బండి సంజయ్


    ఎన్నికలకు రెడీ:
    ఎన్నికల అధికారులు... రేపటి పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లూ చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. ఈసారి EVM పద్ధతిలో కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా పోలింగ్ జరపనున్నారు. ఎన్నికల సిబ్బంది డిసెంబర్ 1న ఉదయం 5.30కి సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో సిద్ధంగా ఉండాలని తెలంగాణ ఎన్నికల కమిషనర్ పార్ధసారధి ఆదేశించారు. ఉదయం 6 గంటలలోగా పోలింగ్ ఏజెంట్లు సిద్ధంగా ఉండాలన్నారు.

    ఇది కూడా చదవండి: Guru Nanak: నేడు గురునానక్ జయంతి... ఇవాళ ఇలా చేస్తే 1000 అశ్వమేథ యాగాల ఫలం

    గ్రేటర్ పరిధిలో మొత్తం 150 డివిజన్లకు ఎన్నికలు జరుగనున్నాయి. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 74 లక్షల 67 వేల 256 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. 150 డివిజన్లకు 1,122 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. ఫలితాలు డిసెంబర్ 4న ప్రకటిస్తారు.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Hyderabad, Hyderabad - GHMC Elections 2020

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు