GHMC Elections 2020: సొసైటీలో పేరున్న, నమ్మదగిన సంస్థల్ని టార్గెట్ చెయ్యడం సోషల్ మీడియాలో కొందరికి అలవాటే. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావొచ్చో... CNN న్యూస్18 మీడియా గ్రూప్ సర్వే చేసినట్లుగా ఓ ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఎన్నికల్లో మొత్తం 150 సీట్లు ఉండగా... వాటిలో అధికార టీఆర్ఎస్కి 105 నుంచి 108 సీట్లు వస్తాయని... ఆ సర్వేలో చెప్పినట్లుగా ఓ నకిలీ రిపోర్టు సోషల్ మీడియాలో షేరింగ్ అవుతోంది. నిజానికి ఇదో ఫేక్ రిపోర్ట్. CNN న్యూస్ 18 గ్రూపు ఇలాంటి సర్వే ఏదీ జరపలేదు. ఈ ఎన్నికలపై ఎలాంటి రిపోర్టులూ విడుదల చెయ్యలేదు. ఇది ఆకతాయిలు, కావాలని చేసిన పనిగా సంస్థ గుర్తంచింది. ఈ సర్వేను ప్రజలు నమ్మొద్దని తెలిపింది.
చట్టపరమైన చర్యలు:
ఇలాంటి నకిలీ సర్వే రిపోర్టును CNN న్యూస్ 18 పేరుతో సర్క్యులర్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంస్థ నిర్ణయించినట్లు తెలిసింది. ప్రజలు మాత్రం ఈ సర్వేను నమ్మొద్దనీ, ఇలాంటి రిపోర్టు తమ చెంతకు వస్తే... దాన్ని ఇతరులకు షేర్ చెయ్యవద్దని కోరింది.
నేటితో ప్రచారానికి ముగింపు:
GHMC ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. డిసెంబర్ 1న ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లూ చేసింది. ఈ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 4న రానున్నాయి. ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం హోరాహోరీగా తలపడుతున్నాయి. పార్టీలన్నీ జోరుగా ప్రచారం సాగించాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో విరుచుకుపడ్డాయి. జస్ట్ 10 రోజుల్లోనే జోరు ప్రచారం సాగడంతో... ఈ ఎన్నికల్లో గెలుపెవరిది అన్నది అంతటా చర్చకు తెరతీసింది. ఇలాంటి సందర్భంలోనే... ఈ నకిలీ సర్వేలు తెరపైకి వచ్చి... ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fact Check, Hyderabad, Hyderabad - GHMC Elections 2020