Home /News /telangana /

HYDERABAD GHMC ELECTIONS 2020 BJP MP ARAVIND ALLEGES KCR FAMILY DID ONE LAKH CORRUPTION IN TELANGANA NK

GHMC Elections: టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ ఫైర్... లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణ

టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ ఫైర్... లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణ (File)

టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ ఫైర్... లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణ (File)

Hyderabad GHMC Elections 2020: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి రేపటి వరకే టైమ్ ఉంది. ఈలోగా బీజేపీ మరో భారీ విమర్శాస్త్రాన్ని సంధించింది.

  Hyderabad Elections 2020: గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కి గట్టి పోటీగా ఇవ్వాలనీ, ప్రత్యర్థి పార్టీగా ఉండాలనే బలమైన వ్యూహంతో బరిలో నిలిచిన బీజేపీ... అందుకు తగ్గట్టుగానే రోజుకో రకమైన బలమైన విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడుతోంది. తాజాగా ఆ పార్టీకి చెందిన నిజామాబాద్ ఎంపీ... ధర్మపురి అరవింద్... కల్వకుంట్ల కుటుంబం రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబం లెక్కలేనంత అవినీతి చేసిందని అన్నారు. హైదరాబాద్... రాంచంద్రాపురంలో శుక్రవారం రాత్రి ప్రచారంలో పాల్గొన్న ఆయన టీఆర్ఎస్ సర్కార్‌పై చేసిన తీవ్ర ఆరోపణలు ఇప్పుడు కాకరేపుతున్నాయి. హైదరాబాద్‌లోని స్తంభాలకు ఎల్‌ఈడీ లైట్లు చుట్టి... ఒక్కో స్తంభానికి రూ.26 వేలు కాంట్రాక్టర్లకు ముట్టచెప్పారని ఆయన ధ్వజమెత్తారు. దేశంలో మొత్తం 20 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందన్న ఆయన... ఏ రాష్ట్రంలోనైనా మతకలహాలు జరిగాయా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ అధికారంలో ఉన్న తెలంగాణలోని భైంసా, కరీంనగర్‌లలో మతకలహాలు ఎందుకు జరిగాయని అరవింద్‌ ప్రశ్నించారు.

  మొత్తానికి ఈసారి ఎన్నికల్లో మతం అంశం కీలకంగా మారింది. అలాగే... ఏమాత్రం అభివృద్ధి జరగలేదనీ... అంతా కుటుంబ పాలనే అని బీజేపీ దూకుడుగా ప్రచారం సాగిస్తోంది. ఎన్నికల ప్రకటన వచ్చినప్పటి నుంచి ఈ 10 రోజుల్లోనే బీజేపీ చాలా విమర్శలు చేసింది. ఇక రేపటితో ప్రచారం ముగిసి... డిసెంబర్ 1న ఎన్నికలు జరనున్నాయి కాబట్టి... బీజేపీ ఇంకా ఎలాంటి వ్యూహాలు రచిస్తుందన్నది ఇప్పుడు చర్చ జరుగుతోంది. ప్రధానంగా టీఆర్ఎస్ ప్రభుత్వం తమ పాలనలో అవినీతి అన్నదే లేదనీ, మత విధ్వేషాలు లేని పాలన అందిస్తున్నామనీ... బీజేపీకి ఛాన్స్ ఇస్తే... హైదరాబాద్ అల్లకల్లోలం అవుతుందని అంటోంది. బీజేపీ మాత్రం... తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మత ఘర్షణలు జరగనప్పుడు... హైదరాబాద్‌లో ఎందుకు జరగనిస్తామని ప్రశ్నిస్తోంది.

  ఇది కూడా చదవండి: AK47 Gift: ఓమైగాడ్... పెళ్లిలో వరుడికి ఏకే47 గిఫ్ట్... సోషల్ మీడియాలో వీడియో వైరల్‌

  కేసీఆర్ సభ:
  GHMC ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభకు టీఆర్‌ఎస్‌ నేతలు సర్వం సిద్ధం చేశారు. సాయంత్రం 5 గంటలకు ఎన్నికల సభను ప్రారంభించాలని టీఆర్‌ఎస్‌ నేతలు నిర్ణయించారు. అప్పటికి మంత్రులు, గ్రేటర్‌లోని 150 డివిజన్ల నుంచి పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు తమకు నిర్దేశించిన వేదికలపైకి చేరుకుంటారు. కేసీఆర్‌ ప్రసంగం చూసేందుకు స్టేడియం లోపల, బయట 12 ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. ఈ సభకు ఒక్కో డివిజన్‌ నుంచి రెండు, మూడు వేల మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి గేటు దగ్గర శానిటైజర్లు అందుబాటులో ఉంచుతున్నట్లు నేతలు చెప్పారు. ఈ సభ ద్వారా బీజేపీని కేసీఆర్ టార్గెట్ చేసి... విమర్శలకు సమాధానం ఇస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Hyderabad, Hyderabad - GHMC Elections 2020

  తదుపరి వార్తలు