హైదరాబాద్‌లో హోర్డింగ్‌లపై నిషేధం...జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం

వర్షాకాల సీజన్ సందర్భంగా జూన్ 15 నుంచి ఆగస్టు 15 వరకు గ్రేటర్ హైదరాబాద్‌లో అన్ని రకాల హోర్డింగ్‌లను నిషేధిస్తూ జీహెచ్ఎంసీ నిర్ణయించింది. 

news18-telugu
Updated: June 11, 2019, 5:08 PM IST
హైదరాబాద్‌లో హోర్డింగ్‌లపై నిషేధం...జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వర్షాకాల సీజన్ సందర్భంగా జూన్ 15 నుంచి ఆగస్టు 15 వరకు గ్రేటర్ హైదరాబాద్‌లో అన్ని రకాల హోర్డింగ్‌లను నిషేధిస్తూ జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ప్ర‌స్తుత వ‌ర్షకాల సీజ‌న్‌తో పాటు ఆక‌స్మికంగా సంభ‌వించే విప‌త్తుల‌ను ఎదుర్కునేందుకు వివిధ శాఖ‌లు మ‌రింత స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని జీహెచ్ఎంసీ కార్యాల‌యంలో మంగళవారం జ‌రిగిన స‌మావేశంలో ప‌లు శాఖ‌ల ఉన్న‌తాధికారులు నిర్ణ‌యించారు. వ‌ర్షాకాలంలో ఈదురుగాలులతో కూడిన వ‌ర్షాలు కురిసి హోర్డింగ్‌లు, యూనిఫోల్స్ కూలిపోయి ప్ర‌మాదం జ‌రిగే అవ‌కాశం ఉన్నందున జూన్ 15వ తేదీ నుండి ఆగ‌ష్టు 15వ తేదీ వ‌ర‌కు గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని అన్ని ర‌కాల హోర్డింగ్‌లను నిషేధిస్తున్న‌ట్టు ఈ స‌మావేశంలో నిర్ణ‌యించారు. జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్ అద్య‌క్ష‌త‌న వ‌ర్ష‌కాల విప‌త్తుల నివార‌ణ ప్ర‌ణాళిక‌పై నిర్వహించిన ఈ స‌మావేశానికి జీహెచ్ఎంసీ, జ‌ల‌మండ‌లి, రెవెన్యూ, ట్రాన్స్‌కో, మెట్రో రైలు, వాతావ‌ర‌ణ శాఖ నీటి పారుద‌ల శాఖ, ఫైర్ స‌ర్వీసులు, ఆర్టీసి, హైద‌రాబాద్, సైబ‌రాబాద్, రాచ‌కొండ పోలీస్ క‌మిష‌న‌రేట్‌ల అధికారులు హాజ‌ర‌య్యారు. హైద‌రాబాద్ మెట్రో రైలు ఎండి ఎన్‌.వి.ఎస్.రెడ్డి, హైద‌రాబాద్ ట్రాఫిక్ విభాగం అడిష‌న‌ల్ సిపి అనీల్‌కుమార్‌, సైబ‌రాబాద్ డిసిపి విజ‌య్‌కుమార్‌, హైద‌రాబాద్ జాయింట్ క‌లెక్ట‌ర్ ర‌వి, జీహెచ్ఎంసీ ఎన్‌పోర్స్‌మెంట్ విభాగం డైరెక్ట‌ర్ విశ్వ‌జిత్ కంపాటి, త‌దిత‌రులు హాజరైన ఈ స‌మావేశంలో దాన‌కిషోర్ మాట్లాడుతూ... జీహెచ్ఎంసీ, జ‌ల‌మండ‌లి, మెట్రో రైలు, విద్యుత్, ఇత‌ర‌ విభాగాల వ‌ద్ద అన్ని క‌లిపి దాదాపు 300 విప‌త్తుల నివార‌ణ ప్ర‌త్యేక‌ బృందాలు సిద్ధంగా ఉన్నాయ‌ని తెలిపారు.

హైదరాబాద్ న‌గ‌రంలో ఎలాంటి విప‌త్తులు ఎదురైనా అన్ని విభాగాలు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి న‌గ‌ర‌వాసుల్లో విశ్వాసం నింపాల‌ని దాన కిషోర్ పేర్కొన్నారు. గ్రేట‌ర్ ప‌రిధిలో ప్ర‌ధానంగా 195 కేంద్రాల‌ను నీటిముంపు ప్రాంతాలుగా గుర్తించామ‌ని, వ‌ర్షాల స‌మ‌యంలో ఈ ప్రాంతాలపై ప్ర‌త్యేక దృష్టిని సాధిస్తున్న‌ట్టు దాన‌కిషోర్ తెలిపారు. ముఖ్యంగా ముంపుకు గుర‌య్యే 195 కేంద్రాల వ‌ద్ద మ్యాన్‌హోళ్లు, క్యాచ్‌పిట్‌ల‌ను మ‌రోసారి త‌నిఖీలు నిర్వ‌హించి ఆయా నాలాల్లో ఏవిధ‌మైన పూడిక‌, వ్య‌ర్థాలు లేకుండా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అధికారుల‌కు సూచించారు. హైద‌రాబాద్ మెట్రో రైలు మార్గంలో 95 హోర్డింగ్‌లు ప్ర‌మాద‌క‌రంగా ఉన్నాయ‌ని హైద‌రాబాద్ మెట్రోరైలు ఎండి ఎన్‌.వి.ఎస్ రెడ్డి ప్ర‌స్తావించారు. అయితే మెట్రో రైలు మార్గంలో ఉన్న అన్ని హోర్డింగ్‌ల‌పై నిషేదం విధించ‌డం జ‌రిగింద‌ని, కొన్ని హోర్డింగ్‌ల‌పై అక్ర‌మంగా ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేస్తున్నార‌ని జీహెచ్ఎంసీ అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ అద్వైత్‌కుమార్ సింగ్ తెలిపారు. ఈ మెట్రో మార్గంలో ఉన్న హోర్డింగ్‌ల‌ను తొల‌గించాల‌ని సంబంధిత ఏజెన్సీల‌ను ఆదేశించామ‌ని అన్నారు. హైద‌రాబాద్ సిటీ పోలీస్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలోని ర‌హ‌దారుల‌పై 150 కేంద్రాల్లో రోడ్ల మ‌ర‌మ్మ‌తులు చేయాల‌ని ట్రాఫిక్ విభాగం అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ అనీల్ కుమార్ సూచించారు. మెట్రో రైలు వంతెన‌ల‌పై నుండి వ‌ర్ష‌పునీరు రోడ్ల‌పైకి ప్ర‌వ‌హిస్తున్నాయని, వీటిని నివారించాల‌ని కోరారు.

హైద‌రాబాద్ న‌గ‌రంలో వివిధ ఏజెన్సీలకు గ‌తంలో జారీచేసిన రోడ్డు త‌వ్వ‌కాల‌కు సంబంధించి ఆయా రోడ్ల నిర్మాణ ప‌నుల‌ను వారం రోజుల్లోగా పూర్తిచేయాల‌ని కమిష‌న‌ర్ దాన‌కిషోర్ ఆదేశించారు. రోడ్లు త‌వ్వి పున‌రుద్ద‌ర‌ణ చేయ‌ని ఏజెన్సీల‌పై చ‌ర్య‌లు చేప‌ట్ట‌నున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు.
Published by: Janardhan V
First published: June 11, 2019, 5:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading