అర్ధరాత్రి హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత వాన..

తూర్పు మధ్య అరేబియా సముద్ర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కారణంగా శుక్ర,శనివారాల్లోనూ హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

news18-telugu
Updated: September 27, 2019, 10:22 AM IST
అర్ధరాత్రి హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత వాన..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సాయంత్రమైందంటే చాలు హైదరాబాద్ నగరం తడిసి ముద్దయిపోతోంది. చిన్నగా మొదలయ్యే జల్లులు కుంభవృష్టిగా మారి నగరాన్ని ముంచెత్తుతున్నాయి. గురువారం అర్ధరాత్రి కూడా నగరంలో కుండపోత వాన కురిసింది.అతి భారీ వర్షానికి చాలాచోట్ల రోడ్లపై మోకాలు లోతు నీళ్లు వచ్చి చేరాయి. రామ్ నగర్,విద్యా నగర్,ఆర్టీసీ క్రాస్ రోడ్, సికింద్రాబాద్,బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, మాసబ్‌ట్యాంకు, సైదాబాద్, హబ్సిగూడ, ఉప్పల్, కాప్రా, మియాపూర్, లింగంపల్లి, చందానగర్, సనత్‌నగర్, మెహిదీపట్నం, కూకట్‌పల్లి, రాయదుర్గం, శేరిలింగంపల్లి, జీడిమెట్ల, షాపూర్‌నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.అతి భారీ వర్షం కావడంతో జీహెచ్ఎంసీ ముందుగానే రెస్క్యూ సిబ్బందిని రంగంలోకి దించింది.

హైదరాబాద్‌లో అత్యధికంగా గుడిమల్కాపూర్‌ ప్రాంతంలో 14.6సెం.మీ వర్షపాతం నమోదైంది. రెడ్‌హిల్స్‌లో 13.3, ఖైరతాబాద్‌లో 12.7,మోండా మార్కెట్‌లో 10.9,నాంపల్లిలో 9.9సెం.మీ వర్షపాతం నమోదైంది.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చాలాచోట్ల రోడ్లు కంకర తేలి గుంతలు ఏర్పడ్డాయి. వర్షపు నీరు నిలిచిపోవడంతో రోడ్లపై ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే, తూర్పు మధ్య అరేబియా సముద్ర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కారణంగా శుక్ర,శనివారాల్లోనూ హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Published by: Srinivas Mittapalli
First published: September 27, 2019, 9:09 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading