Home /News /telangana /

HYDERABAD GANG WHO CHEATED BANKS AND ROBBED 1 CRORE 20 LAKH RUPEES WAS ARRESTED IN HYDERABAD SNR BK

Hyderabad : బ్యాంకు ఖజానాను కొల్లగొట్టిన కేడీ బ్యాచ్ .. సినిమా స్టైల్లో కోటి 33లక్షలు మాయం

(Bank fruaders)

(Bank fruaders)

Hyderabad: బ్యాంకులు ఖాతాదారులకు లోన్లు, క్రెడిట్ కార్డులు, డెబిట్‌ కార్డులు ఇచ్చి వడ్డీలు, సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తే..ఆ మోనార్క్ గ్యాంగ్ ఏకంగా బ్యాంకునే దోచేశారు. ఏమాత్రం అనుమానం రాకుండా కోటి 20లక్షల రూపాయలు బ్యాంకుల నుంచి తీసుకొని మస్కా కొట్టారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India
  (M.Balakrishna,News18,Hyderabad)
  లగ్జరీ(Luxury), హై ఎండ్ కార్ల(High end cars)పై ఉన్న మోజు, పిచ్చితో ఓ వ్యక్తి బ్యాంకు(Bank)ను టార్గెట్ చేశాడు. ఒకే బ్యాంక్ నుంచి వేర్వేరు వ్య‌క్తుల పేర్లతో సుమారు 93 క్రెడిట్ కార్డులు(Credit cards),ప‌ర్స‌న‌ల్ లోన్స్‌(Personal Loans) పొందాడు. ఆ డ‌బ్బుతో తనకు నచ్చిన హై ఎండ్ కార్ల‌ను కొనుగోలు చేశాడు. అసలు బ్యాంక్‌ను మోసం చేసిన తీరు చూస్తుంటే కేటుగాడి క్రిమినల్‌ బ్రెయిన్‌(Criminal Brain)చూసి బ్యాంక్‌ అధికారులతో పాటు పోలీసులు(Police) షాక్ అయ్యారు.

  Telangana : ప్రేమించాడని కుర్రాడ్ని చావబాదిన ఎంపీపీ భర్త .. ప్రస్తుతం అతనే పరిస్థితిలో ఉన్నాడంటే  బ్యాంకు ఖజానానే కొల్లగొట్టారు..
  బోడ శ్రీకాంత్ అనే ఒక వ్యక్తి ఒక ముఠాగా ఏర్ప‌డి ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి దాదాపు కోటి 33 ల‌క్ష‌లు అనేక మంది పేర్లతో క్రెడిట్ కార్డులు, లోన్స్ రూపంలో తీసుకున్నాడు. త‌ప్ప‌డు దృవీక‌ర‌ణ ప‌త్రాల‌తో బ్యాంక్ ను మోసం చేయ‌డం అనుమానం వచ్చిన బ్యాంక్ అధికారులు పోలీసుల‌కు స‌మాచారం అందించ‌డంతో తీగ లాగితే అస‌లు మోసం బ‌య‌ట‌ప‌డింది.  ఐసీఐసీఐ బ్యాంకు నుంచి1.33 కోట్ల మేర డ‌బ్బును నొక్కేసిన‌ నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ల దగ్గర నుంచి దాదాపు 93 డెబిట్ కార్డులు, మూడు క్రెడిట్ కార్డులు, ఐదు హై ఎండ్ కార్లు, 28 పాన్ కార్డులు, 54 ఆధార్ కార్డులు, 24 కంపెనీ గుర్తింపు కార్డులు, 17 మొబైల్ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  లగ్జరీ కార్ల కోసమే నేరాలు..
  బ్యాంకు అధికారుల్ని బురిడి కొట్టింది బ్యాంకు సొమ్ము కాజేసి ముఠాలో బోడ శ్రీకాంత్,  బానోత్ సుమన్, భూక్య నగేష్, గుడ్డేటి గౌతమ్ ఐదుగుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లంతా పాతికేళ్ల వయసు వారే కావడంతో ఇంకా విశేషం. అయితే ఈ మోసానికి తెర తీసింది, సూత్రధారి శ్రీకాంత్‌. తన లివింగ్ ఇంటీరియర్ డిజైనర్, ఎల్లో ల్యాంప్ ఇంటీరియర్ డిజైనర్స్, బ్రిక్ & రాక్ ఇంటీరియర్స్ అనే సూట్ కేస్ కంపెనీలను ప్రారంభించాడు. 2019 సెప్టెంబర్‌లో  శ్రీకాంత్, సుమన్, బిక్షపతి ఆధార్ కార్డ్‌లు, పాన్ కార్డ్‌లను ఉపయోగించి, లివింగ్ ఇంటీరియర్ డిజైనర్‌ని కంపెనిని స్థాపించారు. ఈ కంపెనీకి లేబర్‌ లైసెన్స్‌ కూడా పొందడంతో సుమన్‌, భిక్షపతిలను కంపెనీ డైరెక్ట‌ర్స్‌గా చూపించాడు.

  కోటికిపైగా టోకరా ..
  కంపెనీ ప్రారంభించిన కొన్ని రోజుల త‌రువాత తెలంగాణ‌లో కొన్ని ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. ముఖ్యంగా వరంగల్‌లోని కొన్ని గ్రామాల్లో పర్యటించి తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చిన లోన్ కోసం త‌మ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన వారి ద‌గ్గ‌ర నుంచి ఆధార్‌ కార్డులను సేకరించి ఇత‌ర డాక్యుమెంట్స్ సేక‌రించి తిరిగి నగరానికి వచ్చి సిటీలో ఉన్న కొన్ని బ్యాంక్స్ లో ఆ పత్రాలను ఉపయోగించి వారిని త‌మ సంస్థ  ఉద్యోగులుగా చూపించి వారికి  జీతాలు జమ చేసేందుకు ఐసీఐసీఐ బ్యాంక్ హబ్సిగూడ, ఉప్పల్, రామాంతపూర్ శాఖల్లో 53 బ్యాంకు ఖాతాలను ఓపెన్ చేశారు. ఇలా ఓపెన్ చేసిన ఖాతాల్లో శ్రీకాంత్ నెల‌కు 1 లక్ష నుండి 2 లక్షల వరకు జీతంగా డిపాజిట్ చేసేవాడు.

  Love Cheater : ప్రియురాలికి అబార్షన్ చేయించి మరో యువతితో పెళ్లి .. పీటల మీదే చుక్కలు చూపించిన యువతి  ఒక్కడే వంద మందిగా మారి..
  ఈవిధంగా బ్యాంకు అధికారులకు న‌మ్మ‌కం కుదిరిన తర్వాత బ్యాంకు నుండి 53 ఖాతాలకు క్రెడిట్ కార్డులను తీసుకున్నాడు. అందులో 34 క్రెడిట్ కార్డుల ద్వారా దాదాపు 1.33 కోట్లు డ‌బ్బును వాడుకున్నాడు. అయితే ఈ మొత్తం కార్డు హోల్డర్లకు కొంచెం మొత్తాన్ని చెల్లించాడు. ఈ విధంగా క్రెడిట్ కార్డు డ‌బ్బుల‌తో  శ్రీకాంత్ హై-ఎండ్ కార్లను కొనుగోలు చేశాడ‌ని పోలీసులు చెప్పారు. అయితే పోలీసు విచార‌ణంలో గ‌తంలో కూడా శ్రీకాంత్ అనేక‌ ఇతర బ్యాంకుల నుంచి కూడా కోట్ల రూపాయలు మోసగించినట్లు పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉంటే త‌న‌కు కార్డులు డెల‌వ‌రీ చేసే కొరియర్ బాయ్‌కి కార్డు డెల‌వ‌రీ ఇవ్వడానికి వచ్చిన ప్రతిసారి ఒక్కో కార్డుకు 1000 రూపాయిల వ‌ర‌కు ఇచ్చి మేనేజ్ చేశాడ‌ని పోలీసులు చెబుతున్నారు.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: Banking fraud, Hyderabad crime, Telangana News

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు