హైదరాబాద్ (Hyderabad) లోని హయత్ నగర్ లో రెండు రోజుల క్రితం టెన్త్ క్లాస్ విద్యార్థినిపై జరిగిన గ్యాంగ్ రేప్ కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేరానికి పాల్పడిన విద్యార్థిని తోటి విద్యార్థులు ఘటనకు ముందు తరచూ పోర్న్ వీడియోలు చూసేవారని తెలిసింది. నిందితుల్లో ఒక అబ్బాయి తన తల్లిదండ్రుల ఫోన్ లో తరచూ పోర్న్ వీడియోలు చూసేవాడు. ఆ వీడియోలను తన తోటి విద్యార్థులకు చూపించేవాడు. స్కూల్ అయిపోయిన తరువాత వారికి ఇదే లోకం. అలా వీడియోలు చూస్తూ అందులో చేసినట్టు చేయాలని భావించిన విద్యార్థులు అందుకోసం వాళ్ల క్లాస్ లోనే ఓ బాలికను ఎంచుకున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం అమ్మాయి ఇంటికి వెళ్ళి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
అసలేం జరిగిందంటే..?
హయత్ నగర్ పరిధిలోని 30 అన్నారం వైఎస్సార్ కాలనీలో ఉంటున్న ఓ విద్యార్థిని పదో తరగతి చదువుతుంది. అయితే ఆమె పదో తరగతిలో ఉన్నా కూడా ఐదో తరగతి విద్యార్థినిలాగా ప్రవర్తించేంది. ఆమె ప్రవర్తన చిన్న పిల్లల్లాగా ఉండేదని తెలుస్తుంది. దీనిని ఆసరాగా చేసుకున్న ఐదుగురు విద్యార్థులు స్కూల్లో హెగ్జామ్ అనంతరం బాలిక ఇంటికి వచ్చారు. నోట్ బుక్స్ కోసమే తాము వచ్చినట్టు విద్యార్థులు తెలిపారు. అయితే వాళ్లు చెప్పింది నిజమని భావించిన విద్యార్థిని ఇంట్లోకి రమ్మని చెప్పింది. ఈ క్రమంలో ఆ ఐదుగురు విద్యార్థులు ఆ బాలికను బలవంతంగా రేప్ చేశారు. నిందితుల్లో ఒకరు ఈ దారుణాన్ని వీడియో తీశాడు. ఎవరికైనా ఈ విషయం చెబితే వీడియోను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. ఆ తరువాత వీడియోలను మిగతా విద్యార్థులకు పంపించారు. ఈ క్రమంలో మరో 10 రోజుల తర్వాత కూడా బెదిరించి రేప్ కు పాల్పడ్డారు. ఈ విషయం తల్లి దండ్రులకు తెలియగా పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దారుణానికి పాల్పడిన విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. బాలిక ఇళ్ళు ఉన్న ప్రాంతం నిర్మానుష్యంగా ఉండడంతో ఎవరు కూడా ఈ దారుణాన్ని అడ్డుకోలేకపోయారని తెలుస్తుంది. దర్యాప్తులో భాగంగా విద్యార్థులను విచారించిన పోలీసులు పోర్న్ వీడియోలు చూసే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని తెలిపారు. విద్యార్థులకు ఫోన్ లు ఇవ్వొద్దని ఒకవేళ ఇచ్చినా కూడా ఆ సమయంలో పిల్లలపై శ్రద్ధ పెట్టాలని పోలీసులు సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, Hyderabad, Telangana, Telangana crime news, Telangana News