Ganesh Immirson: ఈ ఏడాది హుస్పేన్ సాగర్ లో నిమజ్జనానికి అనుమతి ఉంటుందా..?

సాగర్ లో నిమజ్జన ఉంటుందా..?

ఈ ఏడాది కూడా వినయాక నవరాత్రి ఉత్సవాలపై సందిగ్ధం వీడడం లేదు. కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఎలా వేడుకులు చేసుకోవాలో తెలియక భక్తులు తర్జనభర్జన పడుతున్నారు. మరోవైపు వినాయక నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ లో అనుమతి ఇస్తారా లేదా అన్నది కూడా ఆసక్తి పెంచుతోంది.

  • Share this:
    వినాయక నవరాత్రి వేడుకలపై కరోనా ఎఫెక్ట్ భారీగా పడుతోంది. గతేడాది ఫస్ట్ వేవ్ కారణంగా చాలా చోట్ల వినాయక మండపాలను పెట్టడం మానేశారు. కొన్ని చోట్ల పెట్టిన కఠిన ఆంక్షలు, నిబంధనల మధ్య సందడి లేకుండానే వినాయ నవరాత్రులు గడిచిపోయాయి. ఈ ఏడాది కూడా వినయక చవితిపై కరోనా ముప్పు తప్పేలా లేదు. ముఖ్యంగా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో వినాయకుడిని ఈ ఏడాది హు్స్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసేందుకు అనుమతి ఇస్తారా ఇవ్వరా అన్నది ప్రశ్నార్థకంగా మిగిలింది. ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో హుస్సేన్‌సాగర్‌లో గణేష్‌ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అనుమతి ఇస్తున్నారా అని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కరోనా పూర్తిగా పోలేదని, మూడో దశలో భాగంగా ఎప్పుడైనా ఉప్పెనలా విరుచుకుపడే అవకాశం ఉందని, అందువల్ల అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

    హుస్సేన్‌సాగర్‌లో గణేష్‌ విగ్రహాల నిమజ్జనానికి శాశ్వతంగా అనుమతి ఇవ్వరాదని, గతంలో ఇదే ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడాన్ని సవాల్‌ చేస్తూ న్యాయవాది మామిడి వేణుమాధవ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమకోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. హుస్సేన్ సాగర్‌లో ఎన్ని విగ్రహాలను నిమజ్జనం చేస్తారని ప్రభుత్వం తరఫున హాజరైన స్పెషల్‌ జీపీ హరీందర్‌ ప్రసాద్‌ను ధర్మాసనం ప్రశ్నించింది.

    కరోనా నేపథ్యంలో గత ఏడాది అనుమతి ఇవ్వలేదని, ఈ ఏడాది అనుమతి ఇచ్చేదీ లేనిదీ తెలుసుకొని చెబుతానని నివేదించారు. ‘హుస్సేన్‌సాగర్‌లోని నీటిని పరిశుభ్రంగా ఉంచాలని.. పరిసరాలను పర్యాటక ప్రదేశంగా అందంగా తీర్చిదిద్దాలని. అప్పుడే పర్యాటకులు ఆకర్షితులవుతారపి. ప్రతి ఏడాది హుస్సేన్‌సాగర్‌లో వేల సంఖ్యలో విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితం అవుతోందని పిటిషనర్ తరపు న్యావాదులు చెప్పారు. మరోవైపు నగరం నడిబొడ్డున ఉన్న సాగర్‌ను కాలుష్యరహితంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని. ఇక్కడ విగ్రహాలను నిమజ్జనం చేయాలా వద్దా అన్నదానిపై ప్రభుత్వం ప్రతి ఏడాది అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోకుండా శాశ్వతంగా నిర్ణయం తీసుకోవాలి అని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేసేందుకు వీలుగా తదుపరి విచారణను ఈనెల 11కు వాయిదా వేసింది.
    Published by:Nagesh Paina
    First published: